జాతీయ వార్తలు

సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్‌కు జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ముజఫర్‌పూర్ వసతి గృహ కేసును విచారిస్తున్న ఎస్‌కే శర్మను బదిలీచేయటాన్ని కోర్టు ధిక్కారణ కిందకు పరిగణిస్తూ సీబీఐ తాత్కాలిక మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావుకు సుప్రీం కోర్టు అసాధారణ శిక్ష వేసింది. మీరు చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొంది. రోజంతా కోర్టులో ఓ మూలన కూర్చోమని ఆదేశించింది. అంతేకాదు లక్ష రూపాయల జరిమానా విధించింది. దీనికి సంబంధించి పూర్వాపరాల్లోకి వెళితే.. ముజఫర్‌పూర్ అత్యాచారాల కేసు దర్యాప్తు నుంచి అధికారులను బదిలీ చేయవద్దని గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను పక్కనబెట్టి తాత్కాలిక డైరెక్టర్‌గా వచ్చిన నాగేశ్వరరావు ముజఫర్‌పూర్ కేసు విచారిస్తున్న సీబీఐ అధికారి ఎస్‌కే శర్మను బదిలీ చేయటం జరిగింది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేస్తూ కోర్టు ధిక్కారణ నోటీసులు జారీ చేసింది. ఈ వ్వవహారానికి సంబంధించి నాగేశ్వరరావు కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆయన తరపున అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదనలు వినిపించారు. నాగేశ్వరరావు ఉద్దేశ్యపూర్వకంగా బదిలీ చేయలేదని, ఇప్పటికే భేషరతుగా క్షమాపణలు చెప్పినట్లు వాదనలు వినిపించినా జస్టిస్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఇది కోర్టు ధిక్కారణ కిందకే వస్తుందని పేర్కొంటూ ఆయనకు లక్షరూపాయల జరిమానా, కోర్టు కార్యకలాపాలు ముగిసే వరకు కోర్టులో ఓ మూలన కూర్చోవాలని ఆదేశించింది.