జాతీయ వార్తలు
కరోనా పాజిటివ్ కేసులు 271
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 21 March 2020
న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ (కోవిడ్-19) చాపకింద నీరులా వ్యాప్తిచెందుతోంది. శుక్రవారం నాటికి 230గా ఉన్న కరోనా పాజిటివ్ కేసులు.. శనివారం మధ్యాహ్నం ఆ సంఖ్య 271కి చేరింది. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు మహారాష్ట్రలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు 67 కేసులు నిర్థారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి వెల్లడించారు. దేశం మొత్త మీద ఇప్పటివరకూ ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, ముంబైలలో ఒకొక్కరు చొప్పున నలుగురు కోవిడ్ కారణంగా మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి.