జాతీయ వార్తలు

పశ్చిమబెంగాల్‌లో కరోనా మూడవ పాజిటివ్‌ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో కరోనా వైరస్‌ మూడవ పాజిటివ్‌ కేసు నమోదైంది. స్కాంట్లాండ్‌ నుంచి రాష్ర్టానికి వచ్చిన మహిళకు నావల్‌ కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు నేడు అధికారికంగా ధృవీకరించారు. అదేవిధంగా కోల్‌కతాలోని బల్లేగంగా ప్రాంతంలో హోం క్వారంటైన్‌ గైడ్‌లైన్స్‌ పాటించని మరో ఇద్దరి మహిళలను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఇరువురు ఇటీవలే విదేశాల నుంచి తిరిగి వచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా పశ్చిమబెంగాల్‌ వైద్యారోగ్యశాఖ విభాగం పౌరులకు విజ్ఞప్తి చేసింది.