జాతీయ వార్తలు
దేశంలో కరోనా కేసులు 195
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు 195కు నమోదు అయ్యాయి. వీరిలో 32మంది విదేశీయులు కాగా 163 మంది భారతీయులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నలుగురు మృతిచెందారు. ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, మహారాష్టల్రలో ఒక్కొక్కరి చొప్పున మృత్యువాత పడ్డారు. అత్యధికంగా మహారాష్ర్టలో 47 కేసులు నమోదు అయ్యాయి. ఇందుల్లో ముగ్గురు విదేశీయులు ఉన్నారు. రెండో స్థానంలో కేరళ నిలిచింది. కేరళలో 28 కేసులు నమోదు కాగా, ఇద్దరు విదేశీయులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో 19(ఒక విదేశీ వ్యక్తి), కర్ణాటకలో 15, ఢిల్లీలో 17 కేసులు నమోదు కాగా, ఒక విదేశీ వ్యక్తి ఉన్నాడు. లఢక్ లో 10, తెలంగాణలో రాష్ర్టానికి చెందిన వారు ఏడుగురు కాగా, విదేశీయులు తొమ్మిది మంది ఉన్నారు. జమ్మూకశ్మీర్ లో 4, రాజస్తాన్ లో 7 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. తమిళనాడు, హర్యానాలో మూడు కేసుల చొప్పున, హర్యానా, పంజాబ్ లో రెండు కేసుల చొప్పున నమోదు అయ్యాయి. ఉత్తరాఖండ్, బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఒక్కొక్కరికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చింది. శుక్రవారం ఇటలీకి చెందిన ఓ టూరిస్ట్ జైపూర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందగా.. అతడి భార్య కోలుకుంటోంది. మరణించిన వారంతా 50 ఏళ్లకు పైబడి.. డయాబెటీస్, గుండె, ఊపిరితిత్తుల సంబంధ, ఇతర దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారే.