రాష్ట్రీయం

‘కాల్‌మనీ’పై వెంటనే స్పందించా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తా
తప్పుడు సంకేతాలు పంపటమే ప్రతిపక్షాల లక్ష్యం
ఏపి సిఎం చంద్రబాబు
గుంటూరు, డిసెంబర్ 19: కాల్‌మనీ వ్యవహరం తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడ నగర పోలీసు కమిషనర్, డిజిపితో మాట్లాడి కఠిన చర్యలు చేపట్టాలని వెంటనే ఆదేశించినట్లు చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన సందర్భంగా శనివారం జరిగిన సభలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. కాల్‌మనీ, అధిక వడ్డీలు వసూలు చేస్తూ పేదలకు ఆర్థిక సహాయం పేరుతో దుర్మార్గంగా వ్యవహరిస్తూ మహిళలను ప్రలోభాలకు గురిచేసి కొందరు అనాగరికంగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
డిసెంబర్ 11న ఒక మహిళ ద్వారా వచ్చిన ఫిర్యాదుపై స్పందించి నిర్భయ చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేయాలని ఆదేశించానన్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం తెస్తుందని, ప్రత్యేక కోర్టు కూడా ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. విజయవాడలో ఏదో జరిగిపోతోందంటూ ప్రతిపక్షం ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపేలా వ్యవహరించి, అసెంబ్లీని అడ్డుకునేందుకు యత్నిస్తోందన్నారు. సమాచారం ఇవ్వమని కోరినప్పటికీ దానిపై ప్రతిపక్షం వారు స్పందించ లేదన్నారు.
చట్టసభల్లో బిల్లులు పాస్‌కాకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటే ప్రజలకే నష్టం జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిపథంలో ముందుకెళ్తుంటే మంచిపేరు వస్తుందనే అక్కసుతోనే అభివృద్ధికి నిరోధక శక్తుల్లా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ముద్ర బ్యాంకు ద్వారా పేదలు రుణం తీసుకునే వ్యవస్థ కోసమే కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ పథకం ఏర్పాటు చేసిందని ఆయన స్పష్టం చేశారు.