రాష్ట్రీయం

కాల్‌మనీపై కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మొదటి రోజు సభను కాల్‌మనీ వ్యవహారం కుదిపేసింది. కేవలం సభలోనే గాక, అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్‌లోనూ అధికార, విపక్షాలకు చెందిన సభ్యులు పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకుకున్నారు. ఇందులో భాగంగా అధికార, విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు వ్యాఖ్యలిలా ఉన్నాయి.
కాల్‌మనీ వ్యవహారాన్ని బయటకు తెచ్చిందే టిడిపి
కాల్‌మనీ వ్యవహారం వెలుగులోకి తెచ్చిందే టిడిపి. విజయవాడ ఎంపి కేశినేని నాని దృష్టికి ఓ మహిళ తేవటంతో ఈ వ్యవహారం వెలుగులోకి రావటం జరిగింది. ఇందుకు ముఖ్యమంత్రి కూడా వెంటనే సానుకూలంగా స్పందించి ఈ వ్యవహారంలో ఏ పార్టీకి చెందిన వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వడ్డీ వ్యాపారాలపై నిర్భయ చట్టం పెట్టిన ఘనత టిడిపిదే!
మహిళలంటే బాబుకు చులకన
మహిళలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న కాల్‌మనీ వ్యవహారాన్ని ప్రభుత్వం చిన్నదిగా చూడటం మహిళల పట్ల చంద్రబాబుకు ఎంత చులకన భావన ఉందో చెప్పకనే చెబుతోంది. ఈ విషయంపై రేపు మాట్లాడదాం, మాపు మట్లాడదామనటం దారుణం. ఈ వ్యవహారంతో విజయవాడలోని ప్రశాంత వాతావరణం దెబ్బతింది. తమ పార్టీ నేతలు ఇందులో ఉన్నారన్న కారణంతో ఈ బురద అందరికి అంటించాలని టిడిపి నేతలు చూస్తున్నారు.
సెక్స్‌రాకెట్ సిగ్గుచేటు: శ్రీవాణి
కాల్‌మనీ వ్యవహారంలో సెక్స్‌రాకెట్ నడపటం, అందులో అధికార పార్టీ నేతలుండటం సిగ్గుచేటు. మహిళల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావల్సిన ముఖ్యమంత్రి బాబు సెటిల్‌మెంట్ సిఎంగా మారారు. నిందితులెవరైనా కఠిన చర్యలు తీసుకోవాలి. వాయిదా తీర్మాన్ని అడిగితే ఎప్పటిలాగే తిరస్కరించారు. టిడిపి హయాంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు రిషితేశ్వరి, ఎమ్మారో వనజాక్షి ఘటనలే నిదర్శనం.
దోషులను తప్పించేందుకు యత్నిస్తున్నారు: కల్పన
కాల్‌మనీ, సెక్స్‌రాకెట్‌లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, నేతలుండంతో వారు పోలీసులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరిగింది. పోలీసుల దాడుల్లో 200 సిడిలు దొరికాయని ప్రకటించారు అవన్నీ ఏమయ్యాయి. కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఇద్దరు అధికారపార్టీ నేతల పేర్లను బహిర్గతం చేయటంతో ఉన్నతాదికారులపై రాజకీయంగా వత్తిడి జరుగుతోంది.
అంబేద్కర్‌ను వైకాపా వ్యతిరేకిస్తోంది: జూపూడి
కాల్‌మనీ వ్యవహరం ఏ ఒక్క రాజకీయపార్టీకి చెందినదిగా కన్పించటం లేదు. అన్ని పార్టీలు ఇందులో ఆరితేరినట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యులను కఠినంగా శిక్షించి తీరాలన్న ఆలోచనకు వచ్చిన నేపథ్యంలో చట్టసభలను, అంబేద్కర్‌ను ఏ మాత్రం గౌరవించకుండా, ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్‌ను వ్యతిరేకించే మార్గాన్ని ఎందుకు ఎంచుకుందో ప్రజలకు చెప్పాల్సిన అవసరముంది.