బిజినెస్

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఏప్రిల్ 4: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం గనులను కేటాయించాలని కేంద్ర గనుల ఉక్కుశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మెహన్‌రావులేఖ రాశారు. విభజన అనంతరం రాష్ట్రంలోనే పెద్ద ప్రభుత్వరంగ సంస్థఅని, స్టీల్ ప్లాంట్ సామర్ధ్యానికి తగినంత గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నాలుగు ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు.

‘ఎంపసిస్’ను టేకోవర్
చేయనున్న ‘బ్లాక్‌స్టోన్’
ముంబయి, ఏప్రిల్ 4: హ్యూలెట్ ప్యాకార్డ్ (హెచ్‌పి) ఎంటర్‌ప్రైజెస్ నుంచి మధ్యస్థాయి పరిమాణం కలిగిన ఐటి సేవల ఎగుమతి సంస్థ ‘ఎంపసిస్’ను త్వరలో స్వాధీనం (టేకోవర్) చేసుకోబోతున్నామని అమెరికాలో లిస్టయిన ‘బ్లాక్‌స్టోన్’ సంస్థ ప్రకటించింది. హెచ్‌పి నుంచి ‘ఎంపసిస్’కు చెందిన మెజార్టీ వాటాలను కొనుగోలు చేసేందుకు దాదాపు 7,071 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు ‘బ్లాక్‌స్టోన్’ సోమవారం వెల్లడించింది. ఒక్కో షేరును 430 రూపాయల ధర చొప్పున ‘ఎంపసిస్’లో హెచ్‌పికి చెందిన 60.5 శాతం వాటాలను కొనుగోలు చేయబోతున్నట్లు ‘బ్లాక్‌స్టోన్’ స్పష్టం చేసింది. దీంతో మన దేశంలో అతిపెద్ద ప్రైవేటు ఈక్విటీ కొనుగోలు ఒప్పందం ఇదే కానుంది.