బిజినెస్

ఆన్‌లైన్ షాపింగ్‌కు యాడ్రోబ్ లోకల్ టచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: యాడ్రోబ్ నెట్‌వర్క్స్ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ యాడ్రోబ్‌ను ఆవిష్కరించనుంది. చిన్నవ్యాపారులకు తోడ్పడే విధంగా పాప్ స్టోర్స్ ద్వారా సేవలందించేందుకు గానూ ఈ హైపర్ లోకల్ ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ రూపొందించారు. చిన్నవ్యాపారాలకు డిజిటల్ అడ్వాంటేజ్‌ను అందించే లక్ష్యంగా యాడ్రోబ్ తమ ఆన్‌లైన్ సేవలను విస్తరించడంతోపాటు నగరవాసులకు అవకాశాలాను కల్పించనుందని నెట్‌వర్క్స్ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ రాజిరెడ్డి కేశిరెడ్డి తెలిపారు. చిన్నతరహా బ్రిక్ అండ్ మోర్టార్ వ్యాపారాలు, సర్వీస్ ప్రొవైడర్లు, ఇతర వెండార్లు స్థానిక కమ్యూనిటీల అవసరాలు తీర్చే విధంగా డిజైన్ చేయబడింది. ఆన్‌లైన్ ద్వార్సాగే ఈ వ్యాపారంలో యాడ్రోబ్ సేమ్ డే డెలివరీ మోడల్‌ను అనుసరిస్తుందని కేశిరెడ్డి వివరించారు. ఇప్పటి వరకు యాడ్రోబ్ ప్రయోగాత్మకంగా అందించిన సేవలను వినియోగదారులు స్వీకరించారు. ఇది మొబైల్‌లో ఆండ్రాయిడ్ వర్షన్‌ను విడుదల చేయగా గూగుల్ ప్లేస్టోర్‌పై 5వేలకు పైగా డౌన్‌లోడ్స్ జరిగాయి. ప్రస్తుతం యాడ్రోబ్ 100కుపైగా విభాగాలలో తమ సేవలను అందిస్తుందని కేశిరెడ్డి పేర్కొన్నారు. వీటిలో గ్రాసరీస్ నుంచి గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్ నుంచి ఫ్యాషన్ వరకూ ఉన్నాయి. దాదాపు వెయ్యి మంది వెండార్లు యాడ్రోబ్‌పై నమోదు చేయబడ్డారని, సైట్‌పై మరో 3వేల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు.
విస్తరణ, ఫండింగ్..
యాడ్రోబ్ అతి త్వరలోనే ఐఓఎస్, విండోస్ వెర్షన్స్‌పై యాప్‌లను ఆవిష్కరించనుంది. వీటి ఉత్పత్తులు, సేవలను కూడా నగర వినియోగదారులను ఆకట్టుకునేందుకు యత్నిస్తూ హైదరాబాద్‌లోని 5వేలకు పైగా వెండార్లకు చేరువవ్వడానికి కృషి చేస్తూ యాడ్రోబ్ ముందుకెళ్తుందని కేశిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని టైర్-2 నగరాల్లో కూడా కార్యకలాపాలను దశల వారీగా చేపడుతూ విస్తరిస్తున్నాం. యాడ్రోబ్ ఇప్పటికే రెండు రాష్ట్రాలలోని 10 నగరాలను గుర్తించిందని, వచ్చే సంవత్సరంలో ఇక్కడి నుంచి సేవలు అందించనున్నామని ఆయన తెలిపారు. వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ నుంచి సహకారాన్ని ఆశిస్తూనే ప్రైవేటు ఈక్విటీ ప్లేయర్లు నుంచి ఫైనాన్స్‌తో విస్తరించాలనుకుంటున్నామని, త్వరలో వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఒప్పందం చేసుకోవడంతోపాటు నిధులను సమీకరించనున్నామని రెడ్డి వివరించారు.
మొబైల్ యాప్ ఫీచర్లు
యాడ్రోబ్ మొబైల్ యాప్ ఫీచర్లలో.. ఆల్ ఇన్ ఒన్ షాపింగ్ యాప్, ప్రత్యేక ఆఫర్ల అడ్వంటేజ్, ఎక్స్‌క్లూజివ్ డీల్స్ లబ్ధి, చుట్టుపక్కల షాప్స్ నుంచి అత్యుత్తమ ఆఫర్లు, ఆకర్షణీయమైన ధరల రాయితీలు, కూపన్ల వినియోగం, ఫుడ్, ఫ్యాషన్, బ్యూటీపై రాయితీలు, అదే రోజు డెలివరీ, ఏ సర్వీసునైనా పొందవచ్చు, ఎలక్ట్రిషియన్ నుంచి ప్లంబర్, పెయింటర్, కార్పొరేటర్, నియర్ బై ఆఫర్ల ద్వారా సమీపంలోని డీల్స్ పొందవచ్చని మేనేజింగ్ డైరెక్టర్ కేశిరెడ్డి వివరించారు.