బిజినెస్

పన్ను మినహాయింపు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: కరోనా వైరస్ కారణంగా దారుణంగా దెబ్బతిన్న పరిశ్రమను ఆదుకోవడానికి పన్ను మినహాయింపు కల్పించాలని సినిమా ఆపరేటర్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదే విధంగా బకాయిలు, రుణాల చెల్లింపులకు ఏడాది గడువు ఇవ్వాలని కోరారు. వివిధ విద్యుత్ డిస్కాంలు కనీస చార్జీల కింద వసూలు చేస్తున్న మొత్తాలను రద్దు చేయాలని కూడా మల్టిప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) ఒక ప్రకటనలో కోరింది. కరోనా వైసర్ విజృంభణ కారణంగా థియేటర్లు మూతపడ్డాయని, షూటింగ్స్ ఆగిపోయాయని గుర్తుచేసింది. ఫలితంగా సినిమా ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు చెప్పింది. ఈ భారీ నష్టాల నుంచి ఎప్పటికి కోలుకుంటామో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, సినిమా ఆపరేటర్లను టాక్స్ నుంచి మినహాయించాలని, అదే విధంగా థియేటర్ల నుంచి కనీస చార్జీల వసూళ్లను నిలిపివేయాలని ఎంఏఐ ప్రభుత్వాన్ని కోరింది.