బిజినెస్

భారీ నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 21: కరోనా వైరస్ ప్రభావం మిగతా దేశాల్లో మాదిరిగానే భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా భారీ నష్టాలు నమోదయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)లో ఈ వారం ప్రారంభంలోనే సెనె్సక్స్ ఏకంగా 2,713.41 పాయింట్లు పతనమై 31,390.07 పాయింట్ల వద్ద ముగిసింది. అదేవిధంగా జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 757.80 పాయింట్లు నష్టపోయి 9,197.40 పాయింట్లకు పడిపోయింది. అంతకుముందు నాలుగు రోజుల కాలంలో స్టాక్ మార్కెట్లు ఈవిధంగా పతనం కావడం ఇది రెండోసారి. ఈ వారం రెండో రోజు ట్రేడింగ్ కూడా నష్టాల్లోనే ముగిసింది. దేశీయ పెట్టుబడిదారులు కొనుగోళ్ల పట్ల ఆసక్తి ప్రదర్శించడంతో భారీ నష్టాల నుంచి తప్పించుకున్నప్పటికీ, స్టాక్ మార్కెట్ల సూచీల పతనం ఆగలేదు. సెనె్సక్స్ 810.98 పాయింట్లు పతనంతో 30,579.09 పాయింట్లుగా నమోదైంది. అదేవిధంగా నిఫ్టీ 230.35 పాయింట్లు పతనమై 8,967.05 పాయింట్ల వద్ద ముగిసింది. కరోనా వైరస్ భయం వెంటాడుతున్న నేపథ్యంలో మార్కెట్లు వరుసగా రెండోరోజు కూడా కోలుకోలేకపోయాయి. బుధవారం కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. సెనె్సక్స్ 1,709.58 పాయింట్ల నష్టంతో 28,869.51 పాయింట్ల వద్ద ముగిసింది. ఒకదశలో ఈ పతనం 2,488.72 పాయింట్ల వద్దకు వెళ్లినప్పటికీ, తక్కువ ధరల షేర్లను కొనేందుకు మదుపరులు ఆసక్తి ప్రదర్శించడంతో కొంతమేరకు కోలుకుంది. కాగా, నిఫ్టీ 498.25 పాయింట్లు నష్టపోయి 8,468.80 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్లను వరుసగా మూడోరోజు కూడా కరోనా భయం వెంటాడింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్కెట్లను ఆదుకోవడానికి చర్యలు చేపడుతున్నట్టు చేసిన ప్రకటనలు, ఆర్‌బీఐ తీసుకున్న పలు నిర్ణయాలు కొంతమేరకు మార్కెట్లకు ఊతమిచ్చినప్పటికీ ఈవారం నాలుగో రోజున కూడా స్టాక్ మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. సెనె్సక్స్ 581.28 పాయింట్లు పతనమై 28,288.23 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 205.35 పాయింట్ల నష్టంతో 8,263.45 పాయింట్ల వద్ద ముగిసింది. కరోనా వైరస్ కారణంగా మార్కెట్ ఏ స్థాయిలో ప్రభావితమైంది? దాని నివారణకు ఏఏ చర్యలు తీసుకోవాలి? అనే అంశాలను అధ్యయనం చేసి, నివేదికను సమర్పించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం భారత స్టాక్ మార్కెట్లకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. దీనికి తోడు తక్కువ ధరల వద్ద సాధ్యమైనన్ని ఎక్కువ షేర్లను కొనుగోలు చేసేందుకు మదుపరులు ఆసక్తిని ప్రదర్శించడంతో, లావాదేవీల చివరిరోజైన శుక్రవారం మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. సెనె్సక్స్ 1,627.73 పాయింట్లు పెరిగి 29,915.96 పాయింట్ల వద్ద ముగిసింది. అదేవిధంగా నిఫ్టీ 482 పాయింట్లు పెరిగి 8,245.45 పాయింట్లకు చేరింది. మొత్తమీద ఈ వారం స్టాక్ మార్కెట్‌ను పరిశీలిస్తే సెనె్సక్స్ 4,187.52 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 1,209.75 పాయింట్లు తగ్గింది. కరోనా వైరస్ భయాందోళనలకు తెరపడితేగానీ స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి తొలగదు.