బిజినెస్

ఆర్థిక రంగంపై కోవిడ్ పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ భారత ఆర్థిక వ్యవస్థను తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఆందోళన పారిశ్రామిక వర్గాల్లో వ్యక్తమవుతోంది. అగ్రదేశాలనే గడగడలాడించిన మహమ్మారి వైరస్ దేశంపై తన పంజా విసరకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని 51 మంది పారిశ్రామిక వేత్తలు ముక్తకంఠంతో కోరారు. పలువురు పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ గ్రూప్‌నకు చెందిన వారంతా ప్రధాని నరేంద్ర మోదీకి ఆందోళనతో కూడిన ట్వీట్ చేశారు. 3కోవిడ్-19నుపై మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోండి. సంస్థలన్నింటినీ మూసివేయించండి. బహిరంగ స్థలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో గుమికూడకుండా 144వ సెక్షన్ విధించాలి2అని అర్బన్ కంపెనీ కో-్ఫండర్ అభిరాజ్ సింగ్ భాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పపర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను ఆయన ట్వీట్ చేశారు. ప్రధాన నగరాలను ఈ వారం అంతా మూసివేయాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు. జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాలు కోవిడ్-19నే ముందే మేల్కొని వైరస్‌ను కొంత వరకూ నిరోధించగలిగాయని ఆయన అన్నారు. సాచివేత ధోరణి ప్రదర్శించిన ఇటలీ, ఇరాన్, యుఎస్‌లో పరిస్థితి తీవ్రరూపం దాల్చిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జాతి, దేశం అన్న భేదం వైరస్‌కు ఉండదు కాబట్టి సకాలంలో నిర్ణయాత్మక, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. పది స్లైడ్ ప్రజెంటేషన్లను మోదీకి పంపా రు. కునాల్ బాల్ (స్నాప్ డీల్), ఫణీంద్ర సామా( రెడ్ బస్), రోహన్ వర్మ( మ్యాప్ మై ఇండియా) అభిప్రాయాలతో ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలను పారిశ్రామికవేత్తలు ప్రశంసించారు. ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిత్యావసర సరుకులు, ఆహారం, మందులు, నగదు ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అలాగే ప్రజా రవాణా వ్యవస్థను ఎల్లవేళలా సిద్ధంగా ఉంచాలని మోదీని కోరారు.