బిజినెస్

బీటీ కాటన్‌పై ‘ట్రెయిట్’ ఎత్తివేత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 17: బీటీ కాటన్ బొల్‌గార్డ్-2 విత్తనాలపై విలు ఆధారిత, రికరింగ్ రాయల్టీ (ట్రెయిట్ విలువ)పై చార్జిలను ఎత్తివేసే విషయాన్ని కేంద్రం ఆలోచిస్తున్నది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. 2015 నుంచి బీటీ కాటన్ అమ్మకాలపై గరిష్ట ధరను ప్రభుత్వమే నిర్ధారిస్తున్నది. వాణిజ్య లాభాలు, ఇతరత్రా అంశాలపైన కూడా కేంద్రమే మార్గనిర్దేశకాలను సిద్ధం చేస్తున్నది. గత ఏడాది 20 రూపాయల ట్రెయిట్ వాల్యూసహా ప్యాకెట్ అత్యధిక ధరను 730 రూపాయలుగా నిర్ధారించింది. బొల్‌గార్డ్-2పై ట్రెయిట్, ఇతర వసూళ్లను ఉపసంహరించే ప్రతిపాదన ఏదైనా ఉందా అన్న ప్రశ్నపై లోక్‌సభలో తోమర్ సమాధానమిస్తూ, వ్యవసాయదారులకు మేలు చేసే రీతిలో ఈ దిశగా కేంద్రం ఆలోచిస్తున్నదని అన్నారు. పింక్ బోల్‌వార్మ్ పురుగును బొల్‌గార్డ్-2 సమర్థంగా అడ్డుకోలేకపోతున్నదని చెప్పారు. జాతీయ కాటన్ పరిశ్రమ, ఐసీఏఆర్ తదితర సంస్థలన్నీ బొల్‌గార్డ్-2 నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని తోమర్ పేర్కొన్నారు. దీని వాడకం ఎక్కువగా ఉందని, పత్తి రైతులకు ఆసరగా ఉండేందుకే ఈ రకమైన విత్తనాలపై వసూలు చేస్తున్న మొత్తాలను నిలిపివేయాలన్న ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నదని వివరించారు.