బిజినెస్

నాలుగు సంస్థలపై సెబీ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 5: స్టాక్ మార్కెట్‌లో మోసపూరితమయిన లావాదేవీలకు పాల్పడినందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) నాలుగు సంస్థలను రెండేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్‌లో పాల్గొనకుండా నిషేధం విధించింది. శేషసాయి పేపర్ అండ్ బోర్డ్స్ లిమిటెడ్ (ఎస్‌పీబీఎల్) షేర్లలో మోసపూరితంగా భారీ పరిమాణంలో క్రయవిక్రయాలు జరిపినందుకు ఈ నాలుగు సంస్థలపై సెబీ చర్య తీసుకుంది. భరత్ జయంతిలాల్ పటేల్, ఫిడెలిటి మల్టీట్రేడ్, పాషా ఫైనాన్స్, అకిరా కన్సల్టెన్సీ అనే నాలుగు సంస్థలపై సెబీ వేటు వేసింది. 2011 డిసెంబర్, 2014 అక్టోబర్ మధ్య కాలంలో ఎస్‌పీబీఎల్ షేర్ల లావాదేవీలపై సెబీ అంతర్గతంగా దర్యాప్తు జరిపి, ఈ కంపెనీ షేర్ల ధర, లావాదేవీల పరిమాణం వేగంగా, భారీగా పెరిగినట్టు గుర్తించింది. ఈ నాలుగు సంస్థలు ఒక సంబంధం గల గ్రూపుగా తమ మధ్య పరస్పరం క్రయవిక్రయాలు జరిపాయని సెబీ పేర్కొంది. ఒక సంబంధం ఉన్న ఉమ్మడి బ్రోకర్ ద్వారా ఈ సంస్థలు ఎస్‌పీబీఎల్ షేర్లలో క్రయవిక్రయాలు జరిపాయి. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే ఈ సంస్థలు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో సర్క్యులర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డాయి. ఫలితంగా బీఎస్‌ఈ మొత్తం మార్కెట్ పరిమాణంలో 25.27 శాతం, ఎన్‌ఎస్‌ఈ మొత్తం మార్కెట్ పరిమాణంలో 21.10 శాతం మేరకు ఎస్‌పీబీఎల్ షేర్ల లావాదేవీలు జరిగాయని సెబీ తెలిపింది.