బిజినెస్

కరోనాపై పోరుకు వడ్డీరేట్లు తగ్గించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను తగ్గించే అంశాన్ని పరిశీలించవలసిన అవసరం ఉందని ఐడీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ నివేదిక పేర్కొంది. రుణాల వృద్ధిని తిరిగి పెంచడానికి ఆర్‌బీఐ తన వంతుగా ప్రస్తుత ప్రాధాన్యతలను వెల్లడించిందని ఐడీఎఫ్‌సీ ‘కరోనా వైరస్, వెల్లడయిన ప్రాధాన్యతలు’ అనే తన నివేదికలో పేర్కొంది. ‘ద్రవ్యోల్బణం అనుమతిస్తే వీలయినంత త్వరలో కరోనా వైరస్ ప్రభావం పెరగకముందే ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించడంపై దృష్టి సారిస్తుందని మళ్లీ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ప్రాధాన్యత వెల్లడించింది. తాజా సమాచారం ప్రకారం, ముందు అనుకున్న దానికన్నా ముందే ఈ చర్య తీసుకునే అవకాశం ఉంది’ అని ఐడీఎఫ్‌సీ ప్రకటన పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన ప్రాధాన్యతలు కూడా ఆర్‌బీఐ ప్రాధాన్యతలను పోలి ఉన్నాయని వివరించింది. రుణాల వృద్ధి పెరుగుతుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ద్రవ్య లోటు లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వం తన వ్యయంపై రాజీపడే అవకాశం లేదని కూడా ఐడీఎఫ్‌సీ నివేదిక పేర్కొంది.