బిజినెస్

తగ్గిన సబ్‌స్క్రిప్షన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: భారత టెలికం కంపెనీల కష్టాలు కొనసాగుతునే ఉన్నాయి. గణాంకాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సబ్‌స్క్రిప్షన్లు తగ్గడం ఒకవైపు, 1.47 లక్షల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సిందేనంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడం మరోవైపు టెలికం కంపెనీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భారత టెలికం రెగ్యులేటరీ అథారిటీ గత ఏడాది అక్టోబర్, నవంబర్ మాసాలకు సంబంధించి విడుదల చేసిన సబ్‌స్క్రిప్షన్ల వివరాలు తగ్గుదలను స్పష్టం చేస్తున్నాయి. నవంబర్ మాసానికి సంబంధించి మొత్తం సబ్‌స్క్రిప్షన్లు 1,175.88 లక్షలుకాగా, గ్రామీణ ప్రాంతాల్లో 509.89 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 665.99 లక్షలుగా నమోదైంది. అక్టోబర్‌లో మొత్తం 1,204.85 లక్షల సబ్‌స్క్రిప్షన్లు జరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో 523.16 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 681.69 లక్షలు చొప్పున సబ్‌స్క్రిప్షన్లు జరిగాయి. వైర్‌లెస్ విభాగంలోనూ, అక్టోబర్ కంటే నవంబర్‌లో తగ్గుదల కనిపిస్తున్నది. మొత్తం 1,154.59 లక్షల సబ్‌స్క్రిప్షన్లు వస్తే, అందులో, గ్రామీణ ప్రాంతల నుంచి 507.26 లక్షలు, పట్టణ ప్రాంతాల నుంచి 547.33 లక్షలు వచ్చాయి. అక్టోబర్ మాసంలో మొత్తం 1,189.40 లక్షల సబ్‌స్క్రిప్షన్లుకాగా, గ్రామీణ ప్రాంతాల వాటా 520.48 లక్షలు, పట్టణ ప్రాంతాల వాటా 662.92 లక్షల సబ్‌స్క్రిప్షన్లు. గత ఏడాది నవంబర్ మాసాంతానికి పోర్టబిలిటీ విజ్ఞప్తులు 4,666.20 లక్షలు వచ్చాయి. కేవలం నవంబర్ మాసంలో 48.80 లక్షలు.
టెలికం మార్కెట్‌లో ప్రైవేటు కంపెనీల వాటా 89.51 శాతంకాగా, ప్రభుత్వ రంగ సంస్థలది 10.49 శాతం. కంపెనీల వారీగా తీసుకుంటే, రిలయన్స్ జియో అత్యధికంగా 32.04 శాతాన్ని ఆక్రమించుకుంది. వొడాఫోన్ ఐడియా 29.12 శాతం వాటాను దక్కించుకుంది. భారతి ఎయిర్‌టెల్ 28.25 శాతం వాటాను సంపాదించుకుంది. బీఎస్‌ఎన్‌ఎల్ వాటా 10.19 శాతం. ఎంటీఎన్‌ఎల్ 0.29 శాతం, రిలయన్స్ 0.001 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.