బిజినెస్

సెన్సెక్స్ పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 20: అంతర్జాతీయ సూచీలు ప్రతికూల ధోరణును ప్రదర్శించడంతో, దాని ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెన్సెక్స్ 152.88 పాయింట్లు నష్టపోయి, 41,170.12 పాయింట్లకు పడిపోయింది. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 45.05 పాయింట్లు పతనమై 12,080.85 పాయింట్ల వద్ద ముగిసింది. అటు బీఎస్‌ఈలో, ఇటు ఎన్‌ఎస్‌ఈలోనూ గురువారం ఉదయం ట్రేడింగ్ లాభాల్లోనే మొదలైంది. దాదాపుగా అన్ని ప్రముఖ కంపెనీల షేర్లు సానుకూల పరిస్థితుల్లో ట్రేడయ్యాయి. కానొక దశలో సెనె్సక్స్ 41,400 పాయింట్లను, నిఫ్టీ 12,170 పాయింట్లను అధిగమించడం ఖాయంగా కనిపించింది. కానీ, అంతర్జాతీయ సూచీల వివరాలు తెలియడం ప్రారంభమైన తర్వాత క్రమంగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఫలితంగా కొనుగోళ్ల దూకుడు తగ్గింది. చివరి గంటల్లో అమ్మకాలు ఎవరూ ఊహించని రీతిలో పెరిగిపోవడంతో, స్టాక్ మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. బీఎస్‌ఈలో ఏషియన్ పెయింట్స్ అత్యదికంగా 2.30 శాతం నష్టపోయింది. హెచ్‌యూఎల్ షేర్లు 1.85 శాతం నష్టాల్లో ట్రేడయ్యాయిగ. టీసీఎస్ 1.75 శాతం, నెస్లే ఇండియా 1.38 శాతం, టెక్ మహీంద్ర 1.36 శాతం చొప్పున నష్టాలను చవిచూశాయి. అయితే, ఇండస్‌ఇండ్ బ్యాంక్ వాటాలు లాభాలను ఆర్జించాయి. దాని షేర్లు 3.57 శాతం లాభాలను సంపాదించాయి. టాటా స్టీల్ 2.48 శాతం, ఎస్బీఐ 2.31 శాతం, ఓఎన్‌జీసీ 1.13 శాతం, పవర్‌గ్రిడ్ 1.01 శాతం చొప్పున లాభపడ్డాయి.
ఎన్‌ఎస్‌ఈలో సిప్లా వాటాలు 2.41 శాతం నష్టాలనుఎదుర్కొన్నాయి. ఏషియన్ పెయింట్స్ 2.12 శాతం, హెచ్‌యూఎల్ 1.92 శాతం, టీసీఎస్ 1.79 శాతం, టెక్ మహీంద్ర 1.60 శాతం చొప్పున నష్టాలను చవిచూశాయి. కాగా, బీఎస్‌ఈలో మాదిరిగానే ఎన్‌ఎస్‌ఈలోనూ ఇండస్‌ఇండ్ షేర్లు లాభాలను సంపాదించాయి. ఈ బ్యాంక్ షేర్ల ధర 3.40 శాతం పెరిగింది. జీ ఎంటర్‌టైనె్మంట్ 3.29 శాతం, టాటా స్టీల్ 2.37 శాతం, ఎస్బీఐ 2.36 శాతం, పవర్‌గ్రిడ్ 1.25 శాతం లాభాలను నమోదు చేశాయి.
ఇలావుంటే, చైనా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడంతో షాంఘై స్టాక్ మార్కెట్ లాభాల బాటలో పరుగులు తీసింది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. చాలా కంపెనీల్లో లావాదేవీలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో మార్కెట్‌కు ఊతమిచ్చే విధంగా వడ్డీ రేట్లను తగ్గించింది. కాగా, టోక్యో స్టాక్ ఎక్ఛ్సేంజ్ కూడా లాభాలను ఆర్జించింది. అయితే, హాంకాంగ్, సియోల్ స్టాక్ మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 0.14 శాతం పెరిగి, 59.20 డాలర్లకు చేరింది. దీని ప్రభావం ఆసియాలో కొన్ని మార్కెట్లను నష్టాల్లోకి నెట్టింది. ఫోరెక్స్ మార్కెట్‌ను పరిశీలిస్తే, డాలర్‌కు రూపాయి విలువ తొమ్మిది పైసలు తగ్గి, 71.63 రూపాయలుగా స్థిరపడింది.