బిజినెస్

తగ్గనున్న వంట గ్యాస్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, ఫిబ్రవరి 20: వచ్చే నెలలో వంట గ్యాస్ (ఎల్‌పీజీ) ధరలు తగ్గే అవకాశాలున్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువులు, ఉక్కు శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం నాడిక్కడ తెలిపారు. చత్తీస్‌గఢ్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇక్కడి స్వామి వివేకానంద విమానాశ్రయానికి చేరుకున్న ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. వంట గ్యాస్ ధరలు వరుసగా పెరుగుతుండడాన్ని ఈ సందర్భంగా ఆయన దృష్టికి తేగా పై విధంగా స్పందించారు. ‘అసలు వంటగ్యాస్ ధరలు వరుసగా పెరుగుతున్నాయనడంలో వాస్తవం లేద’ని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితికి అనుగుణంగానే ఈ నెలలో వంటగ్యాస్ ధరను పెంచడం జరిగిందని స్పష్టం చేశారు. సాధారణంగా చలికాలంలో ఎల్‌పీజీ వినియోగం పెరుగుతుందని, అందువల్ల ఈసారికూడా ఈ రంగంపై వత్తిడి నెలకొందని, ఈక్రమంలోనే ఈ నెలలో ధరలు పెంచడం జరిగిందని, ఆ ధరలు వచ్చే నెలలో తగ్గుతాయని స్పష్టం చేశారు. గత వారం వంట గ్యాస్ ధరను ఒక్కో సిలిండర్‌పై రూ. 144.5 పెంచిన మాట వాస్తవమేనని, అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్ల ఇలా పెంచక తప్పలేదని వివరించారు. వినియోగదారుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రధానమని, అందుకే సబ్సిడీని దాదాపుగా ద్విగుణీకృతం చేయడం జరిగిందని గుర్తు చేశారు. కాగా ప్రధాన్ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా దుర్గ్ జిల్లా పరిధిలోని భిలాయ్ ఉక్కు కర్మాగారాన్ని సందర్శించి అధికారులతో, యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరుపనున్నారు. అలాగే భిలాయ్ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన ఇనుప ఖనిజ గనులను పరిశీలిస్తారు. అక్కడ సరికొత్త ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారు. కాగా దేశానికి అవసరమైన ఉక్కును సమకూర్చడంలో భిలాయ్ ఉక్కు కర్మాగారం ప్రధాన పాత్ర పోషిస్తోందని, ప్రత్యేకించి రైల్వేలకు అవసరమైన 98 శాతం ఉక్కు ఈ పరిశ్రమ నుంచే అందుతోందని ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
*చిత్రం...కేంద్ర పెట్రోలియం, సహజ వాయువులు, ఉక్కు శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్