బిజినెస్

భారత్‌లో సుస్థిర విద్యుత్ శక్తికి అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (ఐఈఐ) తెలంగాణ స్టేట్ సెంటర్ ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఐఈఐ తెలంగాణ సెంటర్ పర్యవేక్షణలో ఇంజనీరింగ్ విభాగాలు సరికొత్తగా వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో ఇంజినీరిగ్, టెక్నాలజీలో మరింత పరిజ్ఞానం పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగతుందని సంస్థ చైర్మన్ జీ.రామేశ్వర్ రావు తెలిపారు. ఇందులో భాగంగా ఇంజినీరింగ్‌లో వస్తున్న మార్పులు, పరిశోధనలు వంటి అంశాలలో యువ ఇంజినీర్లకు దిశ నిర్దేశం అయ్యేలా ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (ఐఈఐ) ఇండియా తెలంగాణ సెంటర్ కృషి చేస్తోందన్నారు. ఇప్పటి వరకు వివిధ అంశాలపై జాతీయ స్థాయిలో సెమినార్‌లు నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 19న ఐఈఐ విశే్వశ్వరయ్య భవన్‌లో ప్రభుత్వాల విధానాలు, నమూనాల సవాళ్ల అంశంపై జాతీయ స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో రామేశ్వర్ రావు సెమినార్ వివరాలను వెల్లడించారు. ఐదు సేషన్‌లపాటు కొనసాగే ఈ సెమీనార్‌లో దేశ వ్యాప్తంగా 300 మంది ఇంజినీర్లు పాల్గొంటున్నారని తెలిపారు.
ఈ సెమినార్‌లో విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ లోటు వంటి అంశాలపై ప్రముఖ ఇంజినీర్లు పాల్గొని విశే్లశించనున్నారు. బుధవారం ప్రారంభమయ్యే సెమినార్‌కు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ.జగదీష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా, ఈనెల 20న జరుగనున్న ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బీ.వినోద్ కుమార్, టీఎస్‌డీఎస్‌పీసీఎల్ చైర్మన్ జీ.రఘుమరెడ్డి పాల్గొంటారని సెమీనార్ టెక్నికల్ చైర్మన్ డాక్టర్ తులసీరామ్ దాస్, ఐఈఐ తెలంగాణ స్టేట్ సెంటర్ కార్యదర్శి టీ.అంజయ్య తెలిపారు.
*చిత్రం... విలేఖరులతో మాట్లాడుతున్న ఐఈఐ టీఎస్‌సీ చైర్మన్ జీ.రామేశ్వర్ రావు