బిజినెస్

వీడని మాంద్యం, కరోనా ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 17: ఆర్థిక మాంద్యం, కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌లో కూడా సోమవారం నష్టాలను చవిచూశాయి. ఒకపక్క ఆర్థిక మాంద్య పరిస్థితులు, కరోనా వైరస్ ప్రభావం ఇనె్వస్టర్లు ఆచితూచి అడుగు వేసేలా చేస్తున్నాయి. సోమవారం జరిగిన లావాదేవీల్లో వివిధ దశల్లో ఊగిసలాడిన సెనె్సక్స్ అంతిమంగా 202.05 పాయింట్లు తగ్గి 41,055.69 పాయింట్ల వద్ద ముగిసింది. ఒకదశలో 390 పాయింట్ల వద్ద సెనె్సక్స్ ఊగిసలాడడం గమనార్హం. అలాగే ఎన్‌ఎస్‌ఈ, నిఫ్టీ కూడా 67.75 పాయింట్లు కోల్పోయి 12,045.80 వద్ద ముగిసింది. ఓఎన్‌జీసీ తాజా త్రైమాసిక నికర లాభం తగ్గిన ప్రభావం దాని షేర్లపై తీవ్రంగా కనిపించింది.
దీని ఫలితంగా ఓఎన్‌జీసీ షేర్లు 3.20 శాతం మేర నష్టపోయాయి. అలాగే సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీల షేర్లు కూడా దాదాపుగా 2.37 శాతం మేర నష్టపోయాయి. కాగా, టైటాన్, టీసీఎస్, కొటక్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు లాభపడ్డాయి. దాదాపు 1.86 శాతం మేర వీటి షేర్లు పుంజుకున్నాయి.