బిజినెస్

బీపీసీఎల్ అమ్మకానికి త్వరలో గ్రీన్ సిగ్నల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆధీనంలోని దేశంలోని రెండో అతిపెద్ద ఆయిల్ రిఫైనర్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)ను అమ్మడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే మంత్రు ల బృందం బీపీసీఎల్ అమ్మకానికి సంబంధించి, బిడ్స్‌ను ఆహ్వానించడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆర్థిక, పెట్రోలియం, న్యాయ, కార్పొరేట్ వ్యవహారాల శాఖలతోపాటు పెట్టుబడుల ఉపసంహరణ శాఖకు చెందిన మంత్రుల బృందం (ఐఎంజీ) ఈ ప్రతిపాదనకు లాంఛనంగా ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. కంపెనీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఉన్నతాధికారులు కొందరు పీటీఐతో మాట్లాడుతూ చెప్పారు. ఈ మంత్రుల బృందం అధికారికంగా ఆమోద ముద్ర వేసిన వెంటనే, సమర్థులైన కొనుగోలుదారుల నుంచి బిడ్స్‌ను ఆహ్వానిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వానికి బీపీసీఎల్‌లో 53.29 శాతం వాటా ఉంది. ఈ మొత్తాన్నీ అమ్మేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ వాటాను కొనుగోలు చేసిన వారికి దేశంలోని ఆయిల్ రిఫైనరీలో 14 శాతం మార్కెట్ వాటా సొంతమవుతుంది. అదే విధంగా ఇంథన మార్కెట్‌లో 20 శాతం దక్కుతుంది. కాగా, ఉన్నతాధికారులు పీటీఐకి ఇచ్చిన సమాచారం ప్రకారం, రెండు దశల బిడ్డింగ్ విధానాన్ని అనుసరించే అవకాశాలు ఉన్నాయి. ఈ కంపెనీ మార్కెట్ విలువ 1.03 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో ప్రభుత్వ వాటా 54,000 కోట్ల రూపాయలు. బిడ్డర్లు ఇదే మార్కెట్ ధరకు 26 శాతం వాటాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మిగతా వాటాలకు తమ సొంతంగా బిడ్స్ వేయాలి. ఈ అమ్మకం ద్వారా 2.1 లక్షల కోట్ల రూపాయలు వస్తాయని కేంద్రం అంచనా వేస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పెట్రోలియం రంగంపైన కూడా దృష్టి పెట్టడం పలు విమర్శలకు తావిస్తున్నది.