బిజినెస్

సబ్సిడీ లేని ఎల్‌పీజీ ధర కోల్‌కతాలో అధికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: దేశంలోని నాలుగు ప్రధాన నగరాలను పరిశీలిస్తే, సబ్సిడీ లేని ఎల్‌పీజీ సిలిండర్ ధర కోల్‌కతాలోనే అధికంగా ఉంది. ఇటీవల కేంద్రం సబ్సిడీ సిలిండర్‌తోపాటు సబ్సిడీ లేని సిలిండర్ ధరను కూడా పెంచిన విషయం తెలిసిందే. ఈ పెరుగుదలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కోల్‌కతాలో సబ్సిడీ లేని సిలిండర్ ధర అమాంతం 149 రూపాయలు పెరగడంతో, 747 రూపాయల నుంచి 896 రూపాయలకు చేరింది. తర్వాతి స్థానంలో చెన్నై ఉంది. అక్కడ ధర 147 రూపాయలు పెరిగి, 734 నుంచి 881 రూపాయలకు చేరింది. ముంబయిలో 145 రూపాయలు పెరగడంతో, 684.50 రూపాయల నుంచి 829.50 రూపాయలుగా ఉంది. ఇక ఢిల్లీలో 144.50 రూపాయలు పెరిగి, 714 రూపాయల నుంచి 858.50 రూపాయలకు చేరింది. ఈ పెరుగుదల పట్ల దేశ మంతటా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నప్పటికీ, తగ్గించే దిశగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.