బిజినెస్

సామాన్యులందరికీ సంక్షేమ ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: దేశంలో 130 కోట్ల మంది ప్రజలకు కేంద్ర బడ్జెట్ ద్వారా సంక్షేమ ఫలాలు అందాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కేంద్రం పనిచేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. ఆదివారం ఇక్కడ ఆమె వివిధ పారిశ్రామిక, వాణిజ్య సంఘాల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ ఆదేశాలతో దేశంలోని పలు నగరాల్లో పర్యటించి వివిధ వర్గాలతో సమావేశమై బడ్జెట్ అంశాలను
వివరిస్తున్నట్లు చెప్పారు. దేశంలో మొదటిసారిగా ఈ ప్రయోగం చేస్తున్నట్లు ఆమె చెప్పారు. చిన్న, పెద్ద పరిశ్రమల అభివృద్ధికి పలు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఆర్థిక నిపుణులు, ప్రొఫెసర్లు, వివిధ వృత్తి రంగాల నిపుణులతో చర్చించి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు ఆమె చెప్పారు. జీఎస్‌టీ పన్నుల వసూళ్లలో రాష్ట్రప్రభుత్వాలు చొరవ తీసుకోవాలన్నారు. సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకునేందుకు జీఎస్‌టీ కౌన్సిల్ ఉందన్నారు. వ్వయసాయ రంగంలో అముల్ మోడల్‌ను అమలు చేయాలని కొంత మంది నిపుణులు ఆర్థికశాఖ మంత్రికి సూచించారు. ఐదు శాతం హెల్త్ సెస్‌ను దిగుమతి చేసుకున్న వైద్య పరికరాలపై విధించడం పట్ల ఆరోగ్య రంగ నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి స్పందిస్తూ టూ టైర్, త్రీ టైర్ నగరాల్లో ఆరోగ్య రంగంలో వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం హెల్త్ సెస్‌ను విధించినట్లు చెప్పారు. ప్రత్యక్ష పన్నుల విధానాన్ని సరళీకృతం చేసినట్లు చెప్పారు. 70 నుంచి 75 మినహాయింపులను తొలగించినట్లు చెప్పారు. కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్, చీఫ్ కమిషనర్ వాస శేషగిరి రావు వందన సమర్పణ చేశారు.

*చిత్రం... ఆదివారం హైదరాబాద్‌లో పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య సంఘాల ప్రతినిధుల సమావేశంలో
మాట్లాడుతున్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్