బిజినెస్

పొదుపు, మదుపుపై కొత్త తరాల తీరేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఇనె్వస్టర్లపై ఒక డిజిటల్ సర్వే చేయడానికి ఒక ఏజెన్సీని నియమించాలని భావిస్తోంది. కొత్త తరం మదుపరుల ఆర్థిక పొదుపు, పెట్టుబడుల విషయంలో వారి వైఖరిని అర్థం చేసుకోవడానికి సెబికి ఈ సర్వే తోడ్పడుతుంది. దీంతోపాటు హౌస్‌హోల్డ్ ఇనె్వస్టర్లపై ఒక అధ్యయనం చేయించడానికి కూడా సెబి కసరత్తు చేస్తోంది. వారి రిస్క్ ప్రొఫైల్‌ను, వారి మదుపు విషయంలో వారి ప్రవర్తనతో దానికి ఉన్న సంబంధాన్ని నిర్ధారించడంతో పాటు మ్యూచువల్ ఫండ్ ఇనె్వస్టర్ల వైఖరి, వారి ఇనె్వస్ట్‌మెంట్ తీరును కనుగొనడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుంది. దేశవ్యాప్తంగా ఇనె్వస్టర్లపై ఒక డిజిటల్ సర్వే నిర్వహించడానికి, హౌస్‌హోల్డ్ ఇనె్వస్టర్లపై ఒక సర్వే చేయడానికి ఇష్టమున్న ఏజెన్సీలు తమ ఆసక్తిని వ్యక్తం చేయాలని (ఈఓఐ) కోరుతూ సెబి రెం డు వేర్వేరు నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ సర్వేల నిర్వహణ, ప్రశ్నావళులను రూపొందించడం, గణాంకాల సేకరణ, గణించడం, విశే్లషించడం, నివేదిక తయారు చేయడం మొదలగు వాటిల్లో విస్తృత అనుభవం ఉన్న ఏజెన్సీలను ఈ రెండు బాధ్యతల కోసం ఎంపిక చేయాలని సెబి కోరుకుంటోంది. ఇంకా సమాచారాన్ని, అధ్యయనాలను రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయి లో పట్టీలుగా రాయించాలని సెబి భావిస్తోంది. ఒప్పందం కుదుర్చుకున్న నాటి నుంచి ఆరు నెలల్లోగా డిజిటల్ సర్వేకు సంబంధించిన, 12నెలల్లోగా హౌస్‌హోల్డ్ సర్వేకు సంబంధించిన తుది విశే్లషణ నివేదికలను సమర్పించవలసి ఉంటుందని సెబి తెలిపింది. ఇనె్వస్టర్లపై చేసే డిజిటల్ సర్వేలో ఇనె్వస్ట్ చేస్తున్న, ఇనె్వస్ట్ చేయని వేలాది మంది వ్యక్తుల ఆర్థిక పొదుపు, మదుపు చేయడంలో వారి వైఖరిని అంచనా వేయడం జరుగుతుంది. ఈ ప్రతిపాదిత సర్వేను దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సర్వే ద్వారా ఇనె్వస్టర్లలో ఆర్థిక ప్రణాళిక, ఆర్థిక మార్కెట్లు, ఫైనాన్సియల్ ప్రోడక్టులు, వివిధ ఇనె్వస్ట్‌మెంట్ ప్రోడక్టుల్లో రిస్క్-రిటర్న్స్ ప్రొఫైల్ గురించి ఉన్న అవగాహనను కనుక్కోవడానికి సెబి ప్రయత్నిస్తుంది. మార్కెట్ నిజాయితి, పారదర్శకత గురించి కొత్త తరాల ఇనె్వస్టర్లకు ఉన్న అవగాహనను కూడా ఈ సర్వే ద్వారా సెబి అధ్యయనం చేస్తుంది. సరయిన పెట్టుబడులు పెట్టడంలో కొత్త తరం ఇనె్వస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు, వారు కోరుకుంటున్న డిమాండ్లు, సెక్యూరిటీస్ మార్కెట్‌లో వారు పాల్గొనడాన్ని పెంచడానికి ఉన్న మార్గాలను కనుగొనడానికి కూడా సెబికి ఈ సర్వే తోడ్పడుతుంది.