బిజినెస్

వరుసగా రెండో రోజూ నష్టాలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 28: ముందే ఊహించిన విధంగా దేశీయ స్టాక్ మార్కెట్లు వారం ఆరంభం నుంచే తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నాయి. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భయాలతో వరుసగా రెండో రోజైన మంగళవారం సైతం సూచీలు నష్టాలను నమోదు చేశాయి. అంతేకాకుండా దేశీయంగా కార్పొరేట్ కంపెనీల బలహీన త్రైమాసిక ఫలితాలు, పన్ను వసూళ్లలో తగ్గుదల నివేదికలు సైతం మదుపర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపాయని వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు. ఇక రెండు మూడు రోజుల వ్యవధిలో రానున్న కేంద్ర బడ్జెట్‌పై వేచిచూసే దోరణితో ఉన్న మదుపర్లు ప్రస్తుతం వాటాల విక్రయం వైపే మొగ్గు చూపుతున్నారు. ఈక్రమంలో బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 188.26 పాయింట్లు (0.46 శాతం) నష్టపోయి 40,966.86 పాయింట్ల దగువన స్థిరపడింది. ఇది ఆ సూచీకి ఆరు నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఇంట్రాడేలో ఈ సూచీ ఓ దశలో 463 పాయింట్లు ఎగబాకి జోరును ప్రదర్శించింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 63.20 పాయింట్లు నష్టపోయి 12,055.80 పాయింట్ల దిగువన స్థిరపడింది. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో భారతి ఎయిర్‌టెల్ భారీగా 4.55 శాతం నష్టపోయింది. అదే బాటలో టాటాస్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి, ఐటీసీ, నెస్టల్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ సైతం నష్టాల పాలయ్యాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫైనాన్స్, సన్‌పార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.53 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్‌ఈలో టెలికాం అత్యధికంగా 4.11 శాతం నష్టాలను సంతరించుకుంది. అలాగే లోహ, ఇంధన, విద్యుత్, వాహన, ఎఫ్‌ఎంసీజీ సూచీలు సైతం నష్టాలను నమోదు చేశాయి. ఇక బీఎస్‌ఈలో చమురు, సహజ వాయువులు, ఐటీ, ఫైనాన్స్ సూచీలు లాభపడ్డాయి. అలాగే బ్రాడర్ మార్కెట్లో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.52 శాతం నష్టపోయాయి. చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే 106 మంది మృతి చెందగా, కొత్తగా 1,300 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలడం ప్రధానంగా ఆసియా మార్కెట్ల భవితవ్యాన్ని అయోమయంలోకి నెట్టిందని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. దక్షిణ కొరియాకు చెందిన మార్కెట్ సూచీ కోస్పి 3 శాతం నష్టపోగా, జపాన్‌కు చెందిన నిక్కీ 0.55 శాతం నష్టాల పాలైంది. ఐరోపా మార్కెట్లు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాలను నమోదు చేశాయి. కాగా దేశీయంగా వాహన రంగం తగ్గిన డిమాండ్ కారణంగా తీవ్ర ఇక్కట్లలో ఉందని ప్రముఖ విశే్లషకుడు వినోద్ నాయర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. బలహీన త్రైమాసిక ఫలితాలు, చైనాలో నోవెల్ కరోనా వైరస్ దేశ ఆర్థిక స్థితిని మరింతగా దెబ్బతీసేలా చేస్తున్నాయన్నారు.
ఎట్టకేలకు రూపాయికి ఊరట
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే ఇటీవల వరుసగా విలువ క్షీణిస్తున్న రూపాయి మంగళవారం కొంత కోలుకుంది. 9 పైసలు లాభపడి ఇంట్రాడేలో 71.34 గా ట్రేడైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.77 శాతం తగ్గడమే ఇందుకు కారణమని విశే్లషకులు చెబుతున్నారు. బ్యారెల్ ముడిచమురు ధర తాజాగా 58.13 డాలర్లు పలికింది.