బిజినెస్

సెబీ’ కొత్త చైర్మన్ నియామకానికి కేంద్రం కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి కొత్త చైర్మన్ నియామకానికి కేంద్ర ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సెబీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న అజయ్ త్యాగి మూడేళ్ల పదవీకాల వ్యవధి వచ్చే నెలతో ముగిసిపోతుంది. త్యాగి 1984 ఐఏఎస్ బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ కేడర్ అధికారి. ఆయన 2017లో సెబీ చైర్మన్‌గా నియమితులయ్యారు. బాధ్యతలను ప్రశంసనీయంగా నిర్వహించిన త్యాగికి కనీసం మరో రెండేళ్లు పదవీకాల పొడిగింపు ఉంటుందని అందరూ భావించారు. ఐతే ఈనెల 24న ప్రభుత్వం విడుదల చేసిన బహిరంగ ప్రకటన సెబీ కొత్త చైర్మన్ పదవికి అర్హులైన వారినుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. కాగా అర్హులైన అభ్యర్థులు సూచిత పార్మెట్‌లో దరఖాస్తులను పూర్తిచేసి, గడచిన ఐదేళ్ల కాలానికి సంబంధించిన రహస్య వార్షిక నివేదికలతో కూడిన అటెస్టెడ్ కాపీలను జతచేసి పంపాలని ఆ ప్రకటన తెలిపింది. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ సర్వీసులో ఉన్న వారు విజిలెన్స్ క్లియరెన్స్, నో పెనాల్టీ, ఇంటిగ్రెటీ సర్ట్ఫికెట్లను సైతం జత చేయాల్సి ఉంటుందని, ఫిబ్రవరి 10 లోగా దరఖాస్తులను పంపాలని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల శాఖ ఈ ప్రకటన జారీ చేసింది. ఇలావుండగా ప్రస్తుత చైర్మన్ త్యాగి సైతం మళ్లీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఐతే ఆయన ఎంపిక జరిగితే అది పొడిగింపుగా కాకుండా కొత్త నియామకంగా జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
*చిత్రం... అజయ్ త్యాగి