బిజినెస్

ఊగిసలాట తప్పదా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాన కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఆర్జనల తీరు, కేంద్ర బడ్జెట్ అంచనాలు ఈ వారం దేశీయ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంకు తన త్రైమాసిక ఫలితాలపై సోమవారం స్పందించనుంది. గత శనివారం ఈ బ్యాంకు ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో ద్విగుణీకృత శాత నికర లాభం రూ. 4,670 కోట్లు ఆర్జించినట్టు ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్, మారుతి సుజుకి, బజాజ్ ఆటోవంటి పలు కంపెనీలు సైతం ఈవారమే త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. అలాగే వచ్చే గురువారం జరిగే అమెరికన్ ఫెడరేషన్ ద్రవ్య వినిమయ విధాన సమావేశంలో వడ్డీ రేట్లపై ఏ నిర్ణయం తీసుకుంటారన్న అంశంపై మదుపర్ల దృష్టి నిలిపారు. ఇక బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ద్రవ్యవినిమయ విధాన నిర్ణయం కూడా కీలకం కానుంది. జనవరి నెల డెరివేటివ్స్ వ్యవధి ముగిసిపోతున్న నేపథ్యంలో గత వారం మొత్తం సూచీలు ఒడిదుడుకులకు గురైన సంగతి తెలిసిందే. అలాగే అన్నింటికన్నా ప్రపంచ దేశాల్లో సంచలనం రేపిన చైనా వైరస్ (కరోనా) ఆ దేశంతోబాటు ఇతర దేశా ల్లో చూపుతున్న ప్రభావంపై వాణిజ్య వర్గాల నిశిత పరిశీలన సాగుతోంది. ఇప్పటికే ఈ భయానక వైరస్ చైనాలో 56 మందిని పొట్టనబెట్టపెట్టుకుంది. అంతేకాకుండా కనీసం డజను దేశాలకు ఈ వైరస్ విస్తరించింది. అలాగే ఇప్పటి వరకు విడుదలైన కార్పొరేట్ ఫలితాలు ఆశాజనకంగా లేని క్రమంలో ఈవారం దేశీయ మార్కెట్లకు ఊగిసలాట కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి ఐసీఐసీఐ ప్రకటించిన నికర లాభం రూ. 4,670 కోట్ల ప్రభావంతో ఎస్‌ఆర్ స్టీల్ గణనీయంగా కోలుకుంది. ఆ సంస్థ కీలక ఆదాయం పెరిగేందుకు వీలుకలిగింది.
రూపాయి విలువ మరింత కీలకం
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఈ వారం అత్యం త కీలకం కానుంది. ఇటీవల రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల తీరుపై సైతం మార్కెట్లను నిర్దేశించవచ్చు. ఇక గత వారం సెనె్సక్స్ 332.18 పాయింట్లు నష్టపోయిన తరుణంలో నెలకొన్న అనిశ్చితితోబాటు ప్రస్తుతం అగమ్య గోచరంగా మారిన ఆర్థికాభివృద్ధి లోటును చక్కదిదేందుకు కేంద్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్‌లో ఏ నిర్ణయాలు చేపడుతుందన్న అంశంపై మదుపర్ల దృష్టి కేంద్రీకృతమైంది.