బిజినెస్

అది సమాచార లోపం కారణంగా జరిగిన పొరపాటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: గెయిల్, ఆయిల్ ఇండియా లిమిటెడ్, పవర్‌గ్రిడ్ వంటి టెలికామేతర సంస్థల నుంచి రూ. 3 లక్షల కోట్ల మేర బకాయిలు వసూలు చేయాలని టెలి కమ్యూనికేషన్ శాఖ నిర్ధారించడం కేవలం సమాచార లోపం వల్ల జరిగిన పొరబాటని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. వాస్తవానికి ఆ సంస్థలు ప్రభుత్వానికి ఎలాంటి బకాయిపడి లేవని తెలిపారు. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాకు సంబంధించిన నాన్ టెలికాం రంగ ఆదాయాలపై బకాయిలు వసూలు చేయాలని గత అక్టోబర్ 24న వచ్చిన సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన గుర్తు చేశారు. ఇందులో భాగంగా గెయిల్ ఇండియా లిమిటెడ్ నుంచి 1.72 లక్షల కోట్లు, ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుంచి రూ. 40,00 కోట్లు, అలాగే మరో రూ. 40,000 కోట్లు పవర్‌గ్రిడ్ నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అలాగే రైల్‌టెల్‌తోబాటు ఇతర ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థల నుంచి బకాయిలు వసూలు చేయాలని నిర్ణయించడం జరిగిందని వివరించారు. పలుమార్లు ఆ సంస్థలపై బకాయిల కోసం వత్తిడి చేసిన ప్రభుత్వం చెల్లించలేని పక్షంలో సుప్రీం కోర్టుకు వెళ్లాల్సిందిగా సూచించడం జరిగిందని, ఈక్రమంలో ఆయిల్ ఇండియా లిమిటెడ్ క్లారిఫికేటరీ, మోడిఫికేటరీ పిటిషన్ బుధవారం దాఖలు చేసింది. అలాగే గెయిల్ ఇండియా సైతం గురువారం సుప్రీంను ఆశ్రయించింది.
ఈక్రమంలో తాము టెలికాం మంత్రిత్వ శాఖతో ఈ విషయంపై చర్చిస్తున్నామని, తమ వంతు సమాధానాన్ని వారికి అందజేశామని వివరించారు. బహుశా సమచార లోపం వల్లే పొరబాటున ఓ ప్రభుత్వ రంగ సంస్థ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను బకాయిలు చెల్లించాలని కోరడం జరిగివుంటుందని ధర్మేంద్ర ప్రధాన్ ఈ సందర్భంగా తెలిపారు. గత అక్టోబర్ 24న సుప్రీం ఇచ్చిన రూలింగ్‌తో ఈ కంపెనీలకు సంబంధం లేదని తాను భావిస్తున్నానన్నారు.