బిజినెస్

నివాస ఆస్తుల ధరల్లో దేశంలో హైదరాబాద్‌కే అగ్రపీఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: నివాస యోగ్య ఆస్తుల ధరల్లో తెలంగాణ రాజధాని హైదరాబాద్ అంతర్జాతీయంగా 14వ ర్యాంకును దక్కించుకుంది. అలాగే ఈ తరహా విలువలో ఆగ్ర భాగాన నిలిచిన తొలి 20 నగరాల జాబితాలో భారత్‌లో కేవలం హైదరాబాద్‌కు మాత్రమే చోటుదక్కింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 150 నగరాలను పరిగణనలోకి తీసుకోగా హైదరాబాద్‌లో గడచిన జూలై నుంచి సెప్టెంబర్ వరకు గల త్రైమాసికంలో నివాస యోగ్య ఆస్తుల ధరల్లో 9 శాతం వృద్ధి చోటుచేసుకుంది. అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ ‘నైట్ ఫ్రాంక్’ దీనిపై నిర్వహించిన అధ్యయనం తాలూకు నివేదికను మంగళవారం నాడిక్కడ విడుదల చేసింది. 2019 మూడోత్రైమాసికంలో అంతర్జాతీయ నివాస యోగ్య నగరాల సూచీలో అగ్ర పీఠాన్ని హంగరీకి చెందిన బుడాపెస్ట్ నగరం ఆక్రమించింది. ఆ నగరంలో వార్షిక ఆస్తుల విలువ వృద్ధిరేటు 24 శాతంగా నమోదైంది. అలాగే చైనాలోని ఉహాన్, ‘గ్జి’యాన్ నగరాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆ నగరాల్లో నివాస యోగ్య ఆస్తుల ధరల్లో 15.9, 14.9 వంతున వృద్ధి చోటుచేసుకుంది. ఇక భారత్‌లోని ఇతర ప్రముఖ నగరాల్లో ఢిల్లీ 3.2 శాతం వృద్ధితో 73వ ర్యాంకును, 2 శాతం వృద్ధితో బెంగళూరు 94వ ర్యాంకును దక్కించుకోగా అహ్మదాబాద్ 1.1 శాతం వృద్థితో 108వ స్థానంలో నిలిచింది. ఈ నగరాల్లో ఆస్తుల విలువలో గత త్రైమాసికంకన్నా 2 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. ఇక 3 శాతం వృద్థితో కోల్కతా 130, ముంబయి 135, చెన్నై 138వ స్థానాల్లో ఉన్నాయని నివేదిక తెలిపింది. కాగా హైదరాబాద్ నివాస స్థలాల మార్కెట్లో గణనీయమైన వృద్ధి చోటుచేసుకుంటోందని, ఐతే నిర్మించి సిద్ధంగా ఉంచిన గృహాల కొనుగోళ్లలో మాత్రం స్వల్ప మాంద్యం చోటుచేసుకుందని ఆ నివేదిక వివరించింది.
ఈ పరిస్థితుల్లో డెవలపర్లతో రేట్లపై బేరసారాలకు అవకాశం పెరిగిందని తెలిపింది. కాగా భారత్‌లోని తొలి 8 అగ్ర నగరాల్లో నివాస స్థలాల రేట్ల వృద్ధి రీటెయిల్ ద్రవ్యోల్బణ వృద్ధిరేటుకన్నా తక్కువగా ఉందని 2016 హెచ్-1 నుంచి ఈ వ్యత్యాసం పెరుగుతోందని నైట్ ప్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ ఈ సందర్భంగా తెలిపారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా 150 ప్రముఖ నగరాల్లో నివాస ఆస్తుల ధరల వృద్థిరేటు గడచిన త్రైమాసికంలో 3.2 శాతంగా నమోదైందని ఆయన వెల్లడించారు.