బిజినెస్

బడ్జెట్ ప్రక్రియ షురూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కొత్త బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ ప్రక్రియ సోమవారం సాంప్రదాయ హల్వా కార్యక్రమంతో ఢిల్లీలో మొదలైంది. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 1న సీతారామన్ తన బడ్జెట్‌ను ఆవిష్కరిస్తారు. బడ్జెట్‌కు ముందస్తుగా జరిగే కసరత్తులో భాగమే ఈ హల్వా ఉత్సవం. బడ్జెట్‌కు సంబంధించిన ఎలాంటి వివరాలు బహిర్గతం కాకుండా ఆర్థిక విభాగం అధికారులు పూర్తి స్థాయి గోప్యతను పాటిస్తారు. నార్త్ బ్లాక్‌లో ఉండే బడ్జెట్ ప్రెస్‌లోనే ఈ పత్రాలు ముద్రితం అవుతాయి. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యే వరకు సంబంధిత అధికారులు బయటకు రారు. పార్లమెంటులో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రదానం చేసిన తర్వాత మాత్రమే ఈ అధికారులకు తమ సన్నిహితులను, కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు 10 రోజులపాటు వీరు నార్త్ బ్లాక్‌లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుంది. ఈ హల్వా ప్రక్రియ అనంతరం నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రెస్‌ను సందర్శించారు.
ఈ పత్రాల ముద్రణ ప్రక్రియ గురించి కూడా ఆమె అడిగి తెలుసుకున్నారు. అతి పెద్ద కళాయిలో తయారైన ఈ ఘుమఘుమలాడే హల్వాను ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న ప్రతిఒక్కరికీ అందించారు. అంటే 10 రోజులపాటు ఈ అధికారులకు తమ కుటుంబ సభ్యులతో సంబంధం ఉండదన్న సంకేతాన్ని అందించడానికే హల్వాను వారికి పంచుతారన్నమాట.
'చిత్రం...కొత్త బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ ప్రక్రియ సోమవారం మొదలైన సందర్భంగా జరిగిన హల్వా ఉత్సవంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్