బిజినెస్

డబ్ల్యూటీవోకు ముందస్తుగానే భారత్ రూ.33 కోట్లు చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: అంతర్జాతీయంగా తన ఖ్యాతిని నిలబెట్టుకుంటున్న భారత్ వివిధ సంస్థలకు చెల్లింపుల విషయంలోనూ అదే ఉత్సాహాన్ని కనబరుస్తోంది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)కు 2020 సంవత్సరానికిగాను విరాళంగా చెల్లించాల్సిన 33 కోట్ల రూపాయలను ముందుగానే ఇచ్చేసిందని ఓ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లోనే భారత్ తన వాటా మొత్తమైన 44,55,445 స్విస్ ఫ్రాంక్‌లను అందించినట్టుగా ఆయన వెల్లడించారు. సభ్య దేశాల నుంచి అందే విరాళాలే ప్రపంచ వాణిజ్య సంస్థ ఆదాయం. వాటి ఆధారంగానే తన వార్షిక బడ్జెట్‌ను రూపొందించుకుంటుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో సభ్య దేశాల వాటా ప్రాతిపదికగానే అవి ఇవ్వాల్సిన విరాళాల మొత్తాన్ని నిర్ణయిస్తారు. సభ్య దేశాల నుంచి కాకుండా పరిశీలక హోదా కలిగిన దేశాల నుంచి పలు ప్రచురణల ద్వారా, అద్దెల ద్వారా కూడా డబ్ల్యూటీవోకు ఆదాయం లభిస్తుంది. సమయానికి తమ వాటా మొత్తాన్ని చెల్లించే అతి కొద్ది పెద్ద దేశాల్లో భారత్ కూడా ఒకటని ఆ అధికారి తెలిపారు. ప్రస్తుతం డబ్ల్యూటీవోలో 164 సభ్య దేశాలు ఉన్నాయి. 1995 జనవరి 1న ఈ అంతర్జాతీయ వాణిజ్య సంస్థ ఏర్పడినప్పటి నుంచి భారత్ అందులో సభ్య దేశంగా ఉంది.