బిజినెస్

మారథాన్‌లో పరుగులు పెట్టిన దిగ్గజ కార్పొరేట్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 19: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఆదివారం జరిగిన ‘టాటా ముంబయి మారథాన్’ కార్యక్రమంలో వివిధ కార్పొరేట్ కంపెనీలకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు. వార్షికోత్సవంలా మారిన ఈ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. టాటా సన్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, రిలయన్స్ గ్రూప్ తరపున అనిల్ అంబానీ, జిందాల్ ఉక్కు గ్రూప్‌నకు చెందిన సజ్జన్ జిందాల్, ఆయన కుమారుడు పార్థ జిందాల్ వంటి అతిరథమహారథులు ఈకార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు. వీరంతా చాలాదూరం వరకు ఈ మారథాన్‌లో పరుగులు పెట్టారని సంబంధిత అధికారులు తెలిపారు. మొత్తం 21,095 కిలోమీటర్ల దూరంతో కూడిన ఈ మారథాన్‌లో అధిక శాతం కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు సగం దూరం వరకు పరుగులు పెట్టారు. జిందాల్ అధినేత చంద్రశేఖరన్, ఆయన కుమారుడు ఇలా సంగం దూరం పరుగెట్టిన వారిలో ఉన్నారు. అలాగే గత కొనే్నళ్లుగా సీ సూట్ ఎగ్జిక్యూటివ్‌లుగా రంగంలోకి వచ్చి పూర్తి దూరాన్ని అందుకునే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వైస్ చైర్మన్, ఎండీ గగన్ బాంగా సైతం ఈ దఫా సగం దూరంతోనే సరిపెట్టారు. ఈ దూరాన్ని ఆయన వేగంగా పరుగులు పెట్టి కేవలం ఒక గంట 42 నిమిషాల్లోనే పూర్తి చేశారు. ఇక 60 ఏళ్ల సజ్జన్ జిందాల్ ఈ మారథాన్ పరుగును కొత్త సంవత్సరానికి శుభారంభంగా అభివర్ణించారు. తమ సంస్థ ఎప్పుడూ ఉద్యోగులకు ఫిట్‌నెస్‌తో కూడిన సామర్ధ్యానికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఇక ప్రైవేటు రంగ బ్యాంకు కోటక్ మహీంద్రాకు చెందిన టాప్ మేనేజ్‌మెంట్ 10 కిలోమీటర్ల విభాగంలో పరుగులు పెట్టింది. ఇందులో కన్సూమర్ బ్యాంకింగ్ విభాగం అధిపతి శాంతి ఏకాంబరం, కార్పొరేట్ బ్యాంకింగ్ విభాగాధిపతి కేవీఎస్ మణియన్ సైతం ఉన్నారు. ఇదే గ్రూపునకు అనుబంధంగా ఉన్న కోటక్ ట్రస్టీషిప్ సర్సీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌతమ్ గవాన్కర్ సైతం సగం దూరం వరకు పరుగులు పెట్టారు. ఈ కార్యక్రమం ద్వారా వివిధ సేవా కార్యక్రమాలకు నిధులు సమీకరించడం హర్షణీయమన్నారామె.

'చిత్రం...మారథాన్‌లో పాల్గొన్న టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్