బిజినెస్

అస్థిరంగానే మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: గత వారం మాదిరిగానే ఈవారం కూడా భారత స్టాక్ మార్కెట్లు అస్థిరంగానే కొనసాగాయి. పలుమార్లు సూచీలు రికార్డు స్థాయికి ఎగిసినప్పటికీ, అదే ఒరవడి చివరి వరకూ నిలవలేదు. స్థూలంగా చూస్తే, లాభాల్లోనే ముగిసిన మార్కెట్లపై పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు ప్రభావం చూపాయి. ఈవారం మార్కెట్లను శాసించిన అంశాల్లో ప్రధానంగా అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న వార్త కూడా ఒకటి. ఈమేర అందిన సంకేతాలు మార్కెట్‌పై ప్రభావం చూపడంతో, సోమవారం మార్కెట్లు పుంజుకున్నాయి. సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న సెనె్సక్స్ ఒక దశలో 300 పాయింట్ల వరకు పెరిగినప్పటికీ, ఆతర్వాత మందగించి, లావాదేవీలు ముగిసే సమయానికి 259.97 పాయింట్లు పెరిగి 41.859.69 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 72.75 పెరిగి 12 వేల 329.55 పాయింట్లకు పడిపోయంది. మొత్తం మీద లాభాలతో ఈవారం మార్కెట్లు శుభారంభం చేశాయ. ఇదే ఒరవడి మంగళవారం కూడా కనిపించింది. అయతే, పలు రకాల వార్తలు ప్రచారం కావడంతో, అటూఇటూ ఊగిసలాడిన సెనె్సక్స్ చివరికి 92.94 పాయింట్లు పెరిగి 41,952.63పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 32.75పాయింట్లు పెరిగి 12.362.30 పాయంట్లుగా నమోదైంది. కాగా, సంక్రాంతి సంబరాలు జరుపుకొన్న బుధవారం స్టాక్ మార్కెట్ల లాభాలకు బ్రేక్ పడింది.సెనె్సక్స్ 79.90 పాయంట్లు పతనమై, 41,872.73 పాయంట్ల వద్ద ముగియగా, 19 పాయంట్లు పతనమైన నిఫ్టీ 12,243.30 పాయంట్లకు చేరింది. అయతే, గురువారం మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయ. అంతర్జాతీయ సానుకూలతో తొలుత సూచీలు రికార్డు స్థాయి లాభాల వైపు దూసుకెళ్లినప్పటికీ తర్వాత దేశీయ పరిస్థితులను బేరీజు వేసుకున్న మదుపరులను నష్ట భయాలు వెంటాడడంతో గురువారం స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. అంతర్జాతీయ సానుకూలత కారణంగా సూచీలు ఒకానొక దశలో రికార్డు స్థాయి లాభాల వైపు దూసుకెళ్లాయ. కానీ, దేశీయ పరిస్థితులు స్థానిక పెట్టుబడిదారులకు నష్ట భయాలు సృష్టించాయ. ట్రేడింగ్ మొత్తం మీద సూచీలు నేల చూపులు చూసినప్పటికీ, చివరికి స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఏకంగా జీవిత కాల గరిష్ట స్థాయి 42,059.45 పాయింట్ల తాకింది. అలాగే నిఫ్టీ సైతం 12,389.05 పాయింట్ల గరిష్ట స్థాయిని స్పృశించింది. కానీ, దేశీయంగా రీటెయిల్ ద్రవ్యోల్బణం అధికం కావడంతోపాటు, బ్యాంకుల నిరర్థక ఆస్తులు గణనీయంగా పెరగడంతో ఇది స్థూలంగా దేశ ఆర్థిక ప్రగతికి అడ్డంకి కావచ్చని అంచనా వేసిన మదుపర్లు వాటాల విక్రయాలకు దిగారు. అలాగే మూడో త్రైమాసికానికి కార్పొరేట్ కంపెనీల ఫలితాలపై సైతం వేచిచూసే ధోరణిని అవలంభించారు. దీంతో సూచీలు వేగంగా కిందికి దిగాయి. చివరికి సెనె్సక్స్ 59.83 పాయింట్లు (0.14 శాతం) లాభపడి 41,932.56 పాయింట్ల ఎగువన స్థిరపడింది. అదే క్రమంలో నిఫ్టీ సైతం కేవలం 12.20 పాయింట్ల (0.10 శాతం) లాభాలకే పరిమితమై 12,355.50 పాయింట్ల ఎగువన స్థిరపడింది. ఈవారం మార్కెట్లకు చివరి రోజైన శుక్రవారం ఉదయం నుంచి రికార్డు స్థాయి గరిష్టాల వైపు దూసుకెళ్లిన సూచీలు, అదే దూకుడును కొనసాగించలేకపోయాయ. సెనె్సక్స్ నామమాత్రపు ఆధిక్యతకే పరిమితం కాగా, నిఫ్టీ స్వల్ప నష్టాన్ని మూటగట్టుకుంది. టెలికాం కంపెనీలకు సంబంధించిన సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్)పై సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పుతోబాటు బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న మొండి బకాయిల సమస్య సైతం మార్కెట్ల లాభాలకు అడ్డుకట్ట వేశాయన్నది వాస్తవం. మొత్తం మీద బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ కేవలం 12.81 పాయింట్లు (0.03 శాతం) లాభపడి 41,945.37 పాయింట్ల ఎగువన స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ సరికొత్త ఆల్‌టైం ఆధిక్యత 42,063.93 పాయింట్లను తాకి జోరును ప్రదర్శించినప్పటికీ, అది నిలబడలేక పోవడంతో అంతే వేగంగా పతనమైంది. అలాగే జీవితకాల ఇంట్రాడే ఆధిక్యత 12,385.45ను తాకిన నిఫ్టీ చివరికి 3.15 పాయింట్ల స్వల్ప నష్టాల్లోకి జారుకొని, 12,352.35 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఈ పరిణామం సహజంగానే అటు మదుపరులను, ఇటు షేర్ మార్కెట్ బ్రోకర్లను నిరాశ పరచింది. స్థూలంగా చూస్తే వారం సెనె్సక్స్ 345.65 పాయింట్లు, నిఫ్టీ 95.55 పాయింట్లు లాభపడ్డాయి. ఇలావుంటే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, వచ్చే వారం కూడా స్టాక్ మార్కెట్లకు ఒడిదుడుకులు తప్పకపోవచ్చు.