బిజినెస్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: పరిశ్రమలతో పాటు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం స్వర్గ్ధామమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ఇక్కడి మాదాపూర్‌లో శనివారం జరిగిన ‘ఇండియా-్థయిలాండ్ బిజినెస్ మ్యాచింగ్ అండ్ నెట్‌వర్కింగ్ ఈవెంట్స్’ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం అత్యంత అనుకూలంగా ఉందని కేటీఆర్ అన్నారు. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తే వౌలిక వసతులను తమ ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. భారత్-్థయిలాండ్ దేశాలకు తెలంగాణ రాష్ట్రం గేట్ వేగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వృద్ధిరేటును మించి ప్రగతి సాధిస్తోందని, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులకు సువర్ణ అవకాశాలున్నాయన్నారు. ఫర్నిచర్ పార్క్‌ను ఏర్పాటు చేయవచ్చని థాయిలాండ్ బృందానికి కేటీఆర్ సూచించారు. రబ్బర్‌వుడ్ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు కూడా అవకాశాలు బాగా ఉన్నాయన్నారు. ఇండియా-్థయిలాండ్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, దాంతో భారత్‌లో మరీ ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు బాగా ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో థాయిలాండ్ ఉప ప్రధాన మంత్రి జురిన్ లక్సన్‌విసిత్ తదితరులు పాల్గొన్నారు. జురిన్‌ను కేటీఆర్ ఈ సందర్భంగా సన్మానించారు.

'చిత్రం... హైదరాబాద్‌లో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో థాయిలాండ్ ఉప ప్రధాని జురిన్ లక్సన్‌విసిత్‌తో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావు