బిజినెస్

పెరగనున్న దిగుమతి సుంకాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: కేంద్ర ప్రభుత్వం రానున్న బడ్జెట్‌లో కాగితం, పాదరక్షలు, రబ్బరు, ఆటబొమ్మలు సహా అనేక వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రోత్సహించడంతో పాటు దేశంలో వస్తు తయారీ (మాన్యుఫాక్చరింగ్) వృద్ధిని పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచాలని భావిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పించిన తన బడ్జెట్ సిఫారసుల్లో గృహోపకరణాలు, రసాయనాలు, రబ్బరు, కోటెడ్ పేపర్, పేపర్ బోర్డులు సహా వివిధ రంగాలకు చెందిన 300కు పైగా సరుకులపై దిగుమతి సుంకాన్ని హేతుబద్ధీకరించాలని ప్రతిపాదించింది. కొత్త నిమాటిక్ రబ్బరు టైర్లపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 10-15 శాతం నుంచి 40 శాతానికి పెంచాలని కూడా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. అదేవిధంగా పాదరక్షలు, వాటికి సంబంధించిన సరుకులపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. ‘అల్ప మూల్యీకృత, చౌక పాదరక్షల దిగుమతులు గణనీయంగా పెరిగాయి. వీటిపై దిగుమతి సుంకాన్ని పెంచితే ధరల పోటీ సమస్యను పరిష్కరించడానికి దోహదపడుతుంది. దిగుమతులు ఎక్కువగా ఆసియాన్ దేశాల నుంచి వస్తున్నాయి. ఈ దేశాలతో భారత్‌కు స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం ఉంది. చైనా ఈ దేశాల మీదుగా పెద్ద మొత్తంలో పాదరక్షలను భారత్‌కు పంపిస్తున్నట్టు అనుమానం ఉంది’ అని ఆ వర్గాలు తెలిపాయి. కలపతో తయారు చేసిన గృహోపకరణాలపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 20 శాతం నుంచి 30 శాతానికి పెంచాలని కూడా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. కోటెడ్ పేపర్, పేపర్ బోర్డులు, చేతితో తయారు చేసిన కాగితంపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న పది శాతం నుంచి రెండింతలు అంటే 20 శాతానికి పెంచాలని కూడా ప్రతిపాదించింది. అయితే, ప్రస్తుతం పనికిరాని కాగితంపై ఉన్న పది శాతం, కలప గుజ్జుపై ఉన్న అయిదు శాతం దిగుమతి సుంకాన్ని పూర్తిగా తొలగించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. చౌక దిగుమతులపై, దిగుమతులు పెరుగుతుండటంపై కాగితపు పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది.