బిజినెస్

ఊరించి.. నిరాశ పరచి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 16: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. అంతర్జాతీయ సానుకూలతో తొలుత సూచీలు రికార్డు స్థాయి లాభాల వైపు దూసుకెళ్లినప్పటికీ తర్వాత దేశీయ పరిస్థితులను బేరీజు వేసుకున్న మదుపర్లను నష్ట భయాలు వెన్నాడాయి. ఈక్రమంలో సూచీలు నేల చూపులు చూసి చివరికి స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. అమెరికా-చైనా వాణిజ్య చర్చలు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చేలా వ్యవధిని స్వల్ప కాలానికి కుదించడంతో ఆసియా మార్కెట్లు బలపడ్డాయి. దీంతో బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఏకంగా జీవిత కాల గరిష్ట స్థాయి 42,059.45 పాయింట్ల తాకింది. అలాగే నిఫ్టీ సైతం 12,389.05 పాయింట్ల గరిష్ట స్థాయిని స్పృశించింది. ఐతే దేశీయంగా రీటెయిల్ ద్రవ్యోల్బణం పెరగణంతో బాటు, బ్యాంకుల నిరర్థక ఆస్తులు గణనీయంగా పెరగడంతో ఇది స్థూలంగా దేశ ఆర్థిక ప్రగతికి అడ్డంకి కావచ్చని అంచనా వేసిన మదుపర్లు వాటాల విక్రయాలకు దిగారు. అలాగే మూడో త్రైమాసికానికి కార్పొరేట్ కంపెనీల ఫలితాలపై సైతం వేచిచూసే ధోరణిని అవలంభించారు. దీంతో సూచీలు వేగంగా కిందికి దిగాయి. చివరికి సెనె్సక్స్ 59.83 పాయింట్లు (0.14 శాతం) లాభపడి 41,932.56 పాయింట్ల ఎగువన స్థిరపడింది. అదే క్రమంలో నిఫ్టీ సైతం కేవలం 12.20 పాయింట్ల (0.10 శాతం) లాభాలకే పరిమితమై 12,355.50 పాయింట్ల ఎగువన స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లో నెస్టల్ ఇండియా అత్యధికంగా 3.23 శాతం లాభపడింది. అలాగే కోటక్ ఇండియా, హెచ్‌యూఎల్, భారతి ఎయిర్‌టెల్, ఆర్‌ఐఎల్, టీసీఎస్, పవర్‌గ్రిడ్, టైటాన్ సైతం లాభాలను సంతరించుకున్నాయి. మరోవైపుఎన్‌టీపీసీ, హీరో మోటోకార్ప్, టాటాస్టీల్, టెక్‌మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ నష్టపోయాయి. సెనె్సక్స్ 30 వాటాల్లో 12 లాభపడగా, 18 నష్టపోయాయి. ఇక రంగాలవారీగా చూస్తే బీఎస్‌ఈలో స్థిరాస్తి, వినియమ వస్తువులు, హెల్త్‌కేర్, టెలికాం, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఇంధన, వాహన సూచీలు 0.97 శాతం లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.78 శాతం లాభపడ్డాయి.
క్షీణించిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తాజాగా క్షీణించింది. 11 పైసలు నష్టపోయి ఇంట్రాడేలో 70.93గాట్రేడైంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.52 శాతం పెరిగి బ్యారెల్ 64.33 డాలర్లు వంతున ట్రేడైంది. ఇక ఆసియా మార్కెట్లలో షాంఘై మాత్రమే నష్టపోగా, హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అలాగే ఐరోపా మార్కెట్లు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలనే నమోదు చేశాయి.