బిజినెస్

56 మంది అధికారులకు ఉద్వాసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: భారత్‌ను వదిలి వెళ్ళాలన్న ఆలోచన తమకు ఎంత మాత్రమూ లేదని ప్రపంచంలోని అతిపెద్ద రిటైలింగ్ సంస్థ వాల్‌మార్ట్ సోమవారం ప్రకటించింది. దేశంలో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తృత మార్పులు తీసుకుని వస్తున్నామని ఇందులో భాగంగానే 8 మంది సీనియర్లతో సహ 56 మంది అధికారులను తొలగించామని వాల్‌మార్ట్ ఇండియా అధ్యక్షుడు, సీఇవో క్రిష్ అయ్యర్ సోమవారం ప్రకటించారు. భారత్‌లో తమ టోకు, చిల్లర వ్యాపారాన్ని మరింతగా పెంపొందిస్తామని ఆయన తెలిపారు. అయితే తాము తొలగించిన అధికారులు ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ విభాగానికి చెందిన వారని తెలిపారు. భారత దేశంలో 28 హోల్ సేల్ విభాగాలు కలిగిన వాల్‌మార్ట్ కేవలం చిన్న వర్తకులకే మాత్రమే వస్తువులను విక్రయిస్తోంది. దేశంలో కిరాణ దుకాణాలకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశ్యంతో ఈ సంస్థ రిటైల్ అమ్మకాలను ప్రభుత్వ నియమాలు నిరోధిస్తున్నాయి. ఈ వాతావరణంలో మరింత సమర్థవంతంగా వ్యాపార కార్యకలాపాలను సాగించడంపై దృష్టి పెట్టామని, ఇందులో భాగంగానే తమ కార్పొరేట్ వ్యవస్థను పునర్ నిర్మించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు. ఇందులో భాగంగానే వివిధ స్థాయిల్లో పని చేస్తున్న 56 మంది అధికారులకు ఉద్వాసన పలికామని అయ్యర్ వివరించారు. వీరందరికీ కూడా హెచ్చు స్థాయిలోనే తొలగింపు లబ్ధిని అందిస్తున్నామని ఆయన వివరించారు. అయితే ఏప్రిల్‌లో మరోసారి ఉద్యోగాల్లో వాల్‌మార్ట్ కోత విధించబోతుందన్న కథనాన్ని ఆయన తిరస్కరించారు. లాభాలు రాకపోవడం వల్ల భారత్ నుంచే తమ కార్యకలాపాలను ఎత్తివేయాలని వాల్ మార్ట్ ఆలోచిస్తున్నదని వచ్చిన వార్తలను కూడా ఆయన ఖండించారు. తాజాగా తొలగించిన 56 మంది అధికారులు భారత్‌లో పని చేస్తున్న తమ మొత్తం సిబ్బందిలో కేవలం ఒక్క శాతం మాత్రమేనని ఆయన తెలిపారు. అమెరికాకు చెందిన అమేజాన్ భారత్‌కు చెందిన ప్యూచర్ రిటైల్‌తో ఒప్పందం కుదుర్చుకుని తమ వ్యాపారాన్ని ముమ్మరం చేయడంతో వాల్‌మార్ట్‌కు తీవ్ర పోటీ ఏర్పడింది. మరోపక్క దేశంలోనే అత్యధిక సంపన్నుడైన ముఖేష్ అంబానీ కూడా ఇటీవల జీయోమార్ట్ పేరిట ఆన్‌లైన్ రిటైల్ వ్యాపారాన్ని మొదలు పెట్టారు. కొనుగోలుదారులకు నేరుగానే ఉత్పత్తులను ఇళ్ళకు అందిస్తామంటూ కొత్త ఆఫర్లు తెరపైకి తెచ్చారు. కాగా రెండో దఫాలో భాగంగా మరి కొంత మంది ఉద్యోగులను తొలగించాలన్న ఆలోచన తమకు ఎంత మాత్రం లేదని వాల్‌మార్ట్ సీఇవో అయ్యర్ విస్పష్టంగా తెలియజేశారు. ఈ రకమైన కథనాలు నిరాధారమని, వాటిలో ఎంత మాత్రం వాస్తవం లేదని అన్నారు. దేశంలో బీటూబీ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తామన్నారు. 2019లో తమ అమ్మకాలు 22 శాతం పెరిగాయని తమ వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

''చిత్రాలు.. వాల్‌మార్ట్
*ఇండియా అధ్యక్షుడు, సీఈవో క్రిష్ అయ్యర్