బిజినెస్

ఆశావహంగా మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 13: అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న సంకేతాలతో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. టెక్నాలజీ, బ్యాంకింగ్, మెటల్ షేర్లపై మదుపుదార్లు దృష్టి సారించారు. మార్కెట్ సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న సెనె్సక్స్ ఒక దశలో 300 పాయింట్ల వరకు పెరిగి అంతిమంగా లావాదేవీలు ముగిసే నాటికి 259.97 పాయింట్లు పెరిగి 41.859.69 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 72.75 పెరిగి 12 వేల 329.55 పాయింట్ల వద్ద ముగిసింది. వీటి లావాదేవీల్లో ఇన్పోసిస్ షేర్లు బాగా పుంజుకున్నాయి. ఈ సంస్థ నికర లాభం పెరిగిందన్న ప్రకటనల ఊపు నేటి లావాదేవీల్లో కనిపించింది. ఈ ఆశాజనక వాతావరణాన్ని ప్రతిభింభిస్తూ ఇన్ఫోసిస్ షేర్లు 4.76 శాతం మేర లాభపడ్డాయి. అలాగే ఇండస్ ఇండ్, భారతీ ఏయిర్‌టెల్, హెచ్‌యుఎల్, టాటాస్టీల్, పవర్ గ్రిడ్, టెక్-మహేంద్రా షేర్లు కూడా 3.34 శాతం మేరకు పుంజుకున్నాయి. అయితే టీసీఎస్, ఎస్‌బీఐ, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, ఆర్‌ఐఎల్, యాక్సిస్ బ్యాంక్‌ల షేర్లు 1.03 శాతం మేర నష్టపోయాయి. ఇన్పోసిస్ త్రైమాసిక ఫలితాలు దేశీయ సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు అంతర్జాతీయంగా అనుకూల పరిస్థితులు మార్కెట్ సెంటిమెంట్‌కు మరింత బలాన్ని ఇచ్చాయని నిపుణులు భావిస్తున్నారు. 3 నెలల పాటు మందకోడిగా సాగిన పారిశ్రామిక ఉత్పత్తులు నవంబర్ నెలలో రికార్డు స్థాయిలో 1.8 శాతం వృద్ధిని సాధించింది. ముఖ్యంగా తయారీ రంగం ఇందుకు దోహదం చేసింది. ఈ వారంలో అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరబోతుందన్న సంకేతాలు అంతర్జాతీయంగా మార్కెట్లకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా అంతర్జాతీయ రాజకీయ, భౌగోళిక సుస్థిరత ప్రభావం దేశీయ మార్కెట్లపై బలంగా ప్రభావం చూపుతోంది. షాంఘై, హాంకాంగ్, సియోల్ మార్కెట్లు బలాన్ని పుంజుకుంటే, ఐరోపా మార్కెట్లు కూడా సానుకూల ధోరణితోనే ముగిశాయి. కాగా అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత మారకమైన రూపాయి 70.82 శాతానికి చేరుకుంది.