బిజినెస్

తెలుగు రాష్ట్రాల్లో 7 రూట్లలో ప్రైవేటు రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 12: దేశంలో ప్రయోగాత్మకంగా ప్రైవేటు రంగంలో ప్రవేశపెట్టిన తేజస్ రైళ్లు విజయవంతంగా నడుస్తుండడంతో రానున్న రెండేళ్లలో భారీ సంఖ్యలో ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కుతాయని రైల్వే అధికారుల ద్వారా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 150 రైళ్లు ప్రైవేటు రంగంలో తిరుగుతాయని వారు అంచనా వేస్తున్నారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడు రైళ్లు నడపాలన్న ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక కార్యాచరణ సిద్ధమవుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం కొత్త ప్రైవేటు రైళ్లు నడిపే కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానించవచ్చని భావిస్తున్నారు.
దేశంలో ప్రైవేటు రంగంలో రైళ్లను నడిపేందుకు ఉన్న అవకాశాలపై ఆ శాఖ ప్రయోగాత్మకంగా తేజస్ పేరుతో రైళ్లను ప్రవేశపెట్టి వాటి నిర్వహణ రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన ఐఆర్‌సిటిసికి అప్పగించిన విషయం విదితమే. ఈ రైళ్లలో లోకో పైలట్, రైల్వేగార్డు మాత్రమే రైల్వేశాఖ నుంచి నియమిస్తారు. ఇతర సిబ్బంది మొత్తం ఐఆర్‌సీటీసీ సమకూర్చుకోవాల్సిందే. ప్రస్తుతం దేశంలో రెండు తేజస్ రైళ్లు నడుస్తుండగా వాటిలో కేవలం ఏసీ చైర్‌కార్, ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ అనే రెండు రకాల బోగీలు మాత్రమే ఉన్నాయి. వీటి నిర్వహణ, సమయపాలన, పరిశుభ్రత, శుచి, రుచి కలిగిన ఆహారం వంటివి ప్రయాణికులకు అందిస్తుండటంతో ప్రజాదరణ పొందినట్లు తేలింది. దీంతో దేశంలో ప్రైవేటు రైళ్లను ప్రోత్సహించాలన్న నీతి ఆయోగ్ సిఫారసులతో రైల్వేశాఖ ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా ఏడు రైల్వే క్లస్టర్లను ఏర్పాటు చేసి రద్దీగా ఉన్న రూట్లలో ప్రైవేటు రైళ్లు నడపాలని సూచించినట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్ సూచనలను రైల్వేశాఖ పరిశీలించిన మీదట ఏడు క్లస్టర్లలో 100 రూట్లలో ప్రైవేటు రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ రూట్లలో 150 రైళ్లను ప్రైవేటు రంగంలో నడిపాలని దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. దేశంలో ఏడు క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్ సూచించిన క్లస్టర్లలో సికింద్రాబాదు క్లస్టరు కూడా ఒకటి కావడం విశేషం. దేశంలోని 100 రూట్లలో 150 రైళ్లలో సికింద్రాబాదు క్లస్టరులో ఏడు రూట్లలో ప్రైవేటు రైళ్లను నడపాలని దాదాపు ఖరారైందని సమాచారం. సికింద్రాబాద్-శ్రీకాకుళం, లింగంపల్లి-తిరుపతి, లింగంపల్లి-గుంటూరు, చెర్లోపల్లి-వారణాశి, విజయవాడ-విశాఖపట్టణం, విశాఖపట్టణం-తిరుపతి, చెన్నై-హౌరా నగరాల మధ్య ప్రైవేటు రైళ్లు నిర్వహించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి మార్చి నెలలో టెండర్లను ఆహ్వానిస్తారని రైల్లే అధికారులు భావిస్తున్నారు. టెండర్లలో రూట్లను దక్కించుకున్న వారు రైలు ఇంజన్లు, బోగీలను సమకూర్చుకోవడానికి ఏడాది నుంచి రెండేళ్ల సమయం ఇస్తారని తెలుస్తోంది. ఈలోగా రైల్వేశాఖ సైతం ఆయా రూట్లలో ట్రాక్ మరమ్మతులు పూర్తిచేసి వేగ పరిమితిని పెంచుతుందని స్పష్టమవుతోంది. రూట్లను దక్కించుకున్న ప్రైవేటు కంపెనీలు ఇంజన్లను ఇతర దేశాలను దిగుమతి చేసుకుంటామంటే అనుమతి ఇస్తారు. లేదా దేశంలో రైల్వేశాఖకు చెందిన ఇంజన్లను కొనుగోలు చేయడానికే కాకుండా అద్దె ప్రాతిపదికన కూడా అందజేసే వెసులుబాటు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కొత్తగా మంజూరయ్యే ప్రైవేటు రైళ్లలో ఏ రకం బోగీలు ఉండాలి, ఆయా స్టేషన్ల మధ్య టికెట్ ధర ఎంత ఉండాలి అనే పలు అంశాలపై ప్రైవేటు కంపెనీలదే తుది నిర్ణయమని వెల్లడవుతోంది. ఒకసారి టెండరు దక్కించుకున్న కంపెనీలు నిబంధనల ప్రకారం నష్టం వచ్చినా పూర్తికాలం రైళ్లను నడపాలన్న ప్రధాన డిమాండ్‌తో అనుమతి ఇస్తారని సమాచారం. కాగా ప్రైవేటు రంగంలోని రైళ్ల నిర్వహణకు గాను రైల్వే శాఖకు ఆయా రూట్లను బట్టి కిలోమీటరుకు చెల్లించే రుసుం రానున్న రెండు నెలల్లో ఖరారు చేస్తారని తెలుస్తోంది. ప్రైవేటు రైళ్లను దక్కించుకునే కంపెనీల వివరాలు ఖరారు కావడానికి జూన్ నెల వరకు ఆగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రెండేళ్ల సమయం అనుకున్నా 2022 జూలై నుంచి ప్రైవేటు రైళ్లు పూర్తి స్థాయిలో పట్టాలెక్కుతాయని భావిస్తున్నారు. తేజస్ రైళ్లు కాకుండా పూర్తిస్థాయి ప్రైవేటు రంగంలో పట్టాలెక్కే తొలి రైలు 2021 ద్వితీయార్థంలో ఉంటుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.