బిజినెస్

పెట్టుబడులు వెనక్కి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం లేకపోయినప్పటికీ, పరిస్థితి ఏవిధంగా మారుతుందోనన్న భయం విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐ)ను వెంటాడుతోంది. ఫలితంగా గత వారం భారత దేశీయ మార్కెట్ నుంచి పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకున్నారు. ఈ నెల ఇప్పటివరకు 2,415 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను ఎఫ్‌పీఐలు ఉపసంహరించుకోవడం గమనార్హం. తాజా గణాంకాల ప్రకారం ఎఫ్‌పీఐల ద్వారా వచ్చిన పెట్టుబడులు 777 కోట్ల రూపాయలు కాగా, ఉపసంహరించుకున్న పెట్టుబడులు 3,192.70 కోట్ల రూపాయలు. ఒకరకంగా చెప్పాలంటే ఈ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు విదేశీ మదుపరులు అమ్మకందారులుగా అవతారం ఎత్తారు. గత ఏడాది సెప్టెంబర్ మాసం నుంచి డిసెంబర్ వరకు కొనుగోలుదారులుగా ఉన్న వీరు ఈనెలలో అందుకు భిన్నంగా పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు మొగ్గుచూపడం గమనార్హం. అంతర్జాతీయ పరిణామాలను, ప్రత్యేకించి అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను మదుపరులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని విశే్లషకులు అంటున్నారు. భారతదేశంలో వృద్ధి రేటు గత 11 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కేవలం ఐదు శాతం మాత్రమే నమోదు కావ డం కూడా విదేశీ మదుపరులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితిలో కొనసాగుతున్న లిక్విడీ షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఉంచడానికి విదేశీ మదుపరులు ఆసక్తిచూపడం లేదనేది సదరు వాదన. భారత వార్షిక బడ్జెట్‌లోని అంశాలేవిధంగా ఉంటాయన్న ఉత్కంఠ కూడా మదుపరుల్లో ఉంది. పూర్తి సమాచారం వచ్చేవరకు వేచిచూసే ధోరణిని వారు అవలంబిస్తున్నారని అంటున్నారు.