బిజినెస్

ఆటుపోట్ల నడుమ ట్రేడింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, జనవరి 11: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగొడిగా సాగుతున్న ప్రభావం ఈవారం భారత స్టాక్ మార్కెట్లపై కూడా స్పష్టంగా కనిపించింది. ఆటుపోట్ల నడుమ ట్రేడింగ్ కొనసాగింది. అయితే భారీ నష్టాలను ఎదుర్కొనే ప్రమాదం నుంచి బయటపడి, స్వల్ప లాభాలతో గట్టెక్కింది. ఈవారం మొత్తం మీద బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 135.11 పాయింట్లు (0.32 శాతం), జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 30.15 పాయింట్లు (0.24 శాతం) పెరగడంతో అటు మదుపరులు, ఇటు స్టాక్ బ్రోకర్లు ఊపిరి పీల్చుకున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలోనే ఈ వారం ట్రేడింగ్ మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీనితో భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయ. బీఎస్‌ఈలో 50 షేర్ మార్కెట్ తీవ్ర ప్రభావానికి లోనైన కారణంగా, సెనె్సక్స్ ఏకంగా 788 పాయింట్లు పడిపోయంది. 787.98 పాయింట్లు కోల్పోయిన సెనె్సక్స్ 40,676.63 వద్ద ముగిసింది. గత ఆరు నెలల్లో ఎన్నడూ ఒకేరోజు ఇన్ని వందల పాయింట్ల మేర సెనె్సక్స్ పడిపోలేదు. గత ఏడాది జూలై 8 నుంచి తీసుకుంటే, సెనె్సక్స్ భారీగా పతనం కావడం ఇదే మొదటిసారి. కాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 233.60 పాయింట్లు కోల్పోయి 11,993.5 వద్ద ముగిసింది. ఈ పరిణామం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసినప్పటికీ, ఆ మరుసటి రోజే స్టాక్ మార్కెట్లు కోలుకోవడం విశేషం. మంగళవారం బీఎస్‌ఈ షేర్ల సూచీ సెనె్సక్స్ 192.84 పాయింట్లు (0.47 శాతం) లాభపడి 40,869.47 పాయింట్ల ఎగువన స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 59.90 పాయింట్లు (0.50 శాతం) లాభపడి 12,052.95 పాయింట్లుగా నమోదైంది. ఒకానొక దశలో, సెనె్సక్స్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెనె్సక్స్ 553 పాయింట్లు ఎగబాకి 41,230.14 పాయింట్ల గరిష్టానికి చేరింది. కానీ ర్యాలీ అదే స్థాయలో కొనసాగలేదు. అదే రీతిలో, నిఫ్టీ సైతం ఓ దశలో 159 పాయింట్లు ర్యాలీ తీసి ఆసక్తిని రేపింది. కానీ ఆతర్వాత కొంత పతనాన్ని చవిచూసింది. ఇక బుధవారం కూడా ఇరాన్-అమెరికా దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం తీవ్ర ప్రభావాన్ని చూపింది. అయితే, స్వదేశీ మదుపరులు చివరిలో ఆదుకోవడంతో భారత స్టాక్ మార్కెట్లు భారీ పతనం నుంచి తప్పించుకున్నప్పటికీ స్వల్ప నష్టాలు తప్పలేదు. బీఎస్‌ఈలో సెనె్సక్స్ 51.73 పాయింట్లు పతనమై 40,815.74 పాయింట్లకు చేరగా, ఎన్‌ఎస్‌ఈలో 27.60 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 12,025.35 పాయింట్లుగా నమోదైంది. అయతే, పతనం నుంచి కోలుకున్న మార్కెట్స్‌లో గురువారం బుల్న్ కొనసాగింది. ఇరాన్‌తో శాంతిని కోరుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత పరిస్థితి మెరుగుపడింది. దీనితో స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టాయ. మదుపర్ల సెంటిమెంటు సానుకూలంగా ఉండడంతో లాభాలు సాధ్యమ య్యాయి. బీఎస్‌ఈలో లావాదేవీలు ప్రారంభం నుంచి చివరి వరకూ బుల్న్ కొనసాగింది. మెరుగుపడిన అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల మధ్య, విదేశీ మదుపరులు కొనుగోళ్లపై ఆసక్తి చూపారు. దీనితో సెనె్సక్స్ ఏకంగా 634.61 పాయింట్లు (1.55 శాతం) పెరిగి, 41,452.35 పాయింట్లకు చేరింది. అదే విధంగా ఎన్‌సీఏలో నిఫ్టీ 190.55 పాయింట్లు (1.58 శాతం) పెరగడంతో 12,215.90 పాయింట్లకు చేరింది. ట్రేడింగ్‌కు చివరి రోజైన శుక్రవారం మరోసారి మార్కెట్లకు ఆటుపోట్లు తప్పలేదు. భారీగా పెరిగి, ఆతర్వాత తగ్గి, ఒక దశలో రికార్డు లాభం, మరో దశలో నష్టం దిశగా పరుగులు తీసిన మార్కెట్లు చివరికి లాభాల్లోనే ముగిశాయి. సెనె్సక్స్ 147.37 పాయింట్లు (0.36 శాతం) పెరిగి 41,599.72 పాయింట్లకు చేరింది. అదే విధంగా నిఫ్టీ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే కొనసాగి, చివరికి 40.90 పాయింట్లు (0.32 శాతం) మెరుగుపడి 12,256.80 పాయింట్ల వద్ద ముగిసింది. స్థూలంగా చూస్తే, ఈ వారం మొత్తం మీద స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లోనే నడిచాయ. మొత్తం మీద స్వల్ప లాభాల్లో ముగిశాయి. ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉన్నందున వచ్చే వారం కూడా మార్కెట్లు ఇదే తరహాలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.