బిజినెస్

సాంకేతిక, వాణిజ్య నష్టాల తగ్గింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: నాణ్యతతో కూడిన విద్యుత్‌ను సరఫరా చేస్తూనే సాంకేతిక, వాణిజ్యపరమైన నష్టాలను తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపీడీసీఎల్) దేశంలోనే అగ్రగామి విద్యుత్ సంస్థగా నిలుస్తోంది. దేశంలో ఇటువంటి విద్యుత్ పంపిణీ సంస్థలు 50కి పైగా ఉండగా ఇందులో ఏపీలో ఐదు జిల్లాలతో కూడిన ఈపీడీసీఎల్ రెండు విధాలైన విద్యుత్ నష్టాలను తగ్గించ గలుగుతోంది. గత రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న వ్యూహాత్మక చర్యలతో ఫలితాలు సాధించగలిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు (ఏపీఎస్‌ఇబీ)గా ఏర్పడిన 2000-01 ఆర్థిక సంవత్సరంలో సాంకేతిక, వాణిజ్య పరమైన నష్టాలను ఏకంగా 19.76శాతం మేర ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉండేవి. డిస్కంగా ఏర్పడిన తొలి సంవత్సరంలోనే 20 శాతం మేర ఈ విధమైన నష్టాలను ఎదుర్కోక తప్పలేదు. దీంతో సాంకేతికంగా ఎదురయ్యే అనేక లోపాలను అధిగమించడంపై యాజమాన్యం దృష్టి సారించింది. క్షేత్రస్థాయి నుంచి దీనిని పరిశీలిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ విద్యుత్ లైన్లు, హెచ్‌టీ, వాణిజ్యం, చివరకు గృహ వినియోగదారులకు అందించే విద్యుత్ సరఫరాలో లోపాలను, అంతరాయాలను ఎప్పటికపుడు సమీక్షించడంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది. దీని ఫలితంగా 2001-02లో 17.28శాతానికి ఈ నష్టాలను తగ్గించగలిగింది. కేవలం ఏడాది కాలంలో రెండు శాతం మేర తగ్గించినట్టు అయ్యింది. ఇక 2002-03 ఆర్థిక సంవత్సరంలో 18.39 శాతం మేర, 2003-04లో 15.83 శాతం, 2004-05 ఆర్థిక సంవత్సరంలో 15.17 శాతం, 2005-06లో 14.04 శాతం, 2006-07లో 12.46 శాతం, 2007-08లో 9.10 శాతం, 2008-09లో 9.16మేర సాంకేతిక, వాణిజ్యపరమైన నష్టాలను క్రమేపీ తగ్గించుకుంటూ రాగలిగింది. 2009-10లో 10.17 శాతం నష్టాలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. మళ్ళీ 2010-11 ఆర్థిక సంవత్సరంలో చూస్తే 10.2 శాతం, 2011-12లో 9.37, 2012-13లో 10.49 శాతం, 2013-14లో 11.11 శాతం, 2014-15 ఆర్థిక సంవత్సరంలో 10.97 శాతం, 2015-16లో 8.43 శాతం, 2016-17లో 9.10 శాతం, 2017-18లో 12.75 శాతం మేరకు ఈ తరహా నష్టాలు తగ్గించుకుంటూ వస్తోంది. ఇదే తరహాలో ఈ ఆర్థిక సంవత్సరంలో (2019-20) కేవలం 8.84శాతానికి నష్టాలు తగ్గాయి.
రానున్నర రెండేళ్ళకాలంలో కనీసం మూడు శాతం మేర నష్టాలను తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, కేవలం నాలుగు నుంచి ఇదు మేర ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ విధంగా డిస్కం ఏర్పడిన ఆర్థిక సంవత్సరంలో 19.76శాతం ఉండగా గడచిన 20 ఏళ్ళకాలంలో సగానికి పైగా నష్టాలను తగ్గించుకుంటూ రాగలిగామన్నాయి. అందువల్లే దేశంలో మరే డిస్కంలు సాధించలేని ఫలితాలను ఒక్క ఈపీడీసీఎల్‌కు సొంతమైందంటూ సంతృప్తి వ్యక్తం చేశాయి. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి శ్రమించినందునే ఈ ఫలితాలు వచ్చాయన్నారు.