బిజినెస్

నాలుగు సహకార చక్కెర కర్మాగారాలకు రూ. 100 కోట్ల ఎన్సీడీసీ రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 9: రాష్ట్రంలోని 4 సహకార చక్కెర కర్మాగారాలకు 100 కోట్ల రూపాయల మేర రుణానికి సంబంధించి పాలనా ఆమోదాన్ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం తెలిపింది. నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) రెండో విడతగా ఈ నిధులను విడుదల చేయనుంది. రాష్ట్రంలోని శ్రీ విజయరామ గజపతి చక్కెర కర్మాగారం (విజయనగరం జిల్లా), విశాఖ జిల్లాలోని చోడవరం, ఏటికొప్పాక, తాండవ సహకార చక్కెర కర్మాగారాలకు 200 కోట్ల రూపాయలను వర్కింగ్ క్యాపిటల్ లోన్ కింద ఎన్సీడీసీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఈ నిధులను మంజూరు చేసింది. శ్రీ విజయరామ గజపతి చక్కెర కర్మాగారానికి 12.45 కోట్ల రూపాయలు (రైతుల బకాయిలు, రవాణా, విత్తన రాయితీల చెల్లింపునకు రూ. 3.12 కోట్లు, అప్కాబ్ రుణం చెల్లించేందుకు 9.33 కోట్ల రూపా
యలు) కేటాయించింది. చోడవరం కర్మాగారానికి 40.28 కోట్ల రూపాయలు ( రైతు బకాయిలు, రాయితీలకు 18.28 కోట్లు, ఆప్కాబ్ రుణం చెల్లించేందుకు 22 కోట్లు), ఏటికొప్పాక కర్మాగారానికి 27.61 కోట్లు ( రూ.12.61 కోట్లు, 15 కోట్లు), తాండవ కర్మాగారానికి 19.66 కోట్లు ( రూ. 14.75 కోట్లు, రూ.4.91 కోట్లు ) కేటాయించింది. ఈ రుణాన్ని 9.86 శాతం మేర వడ్డీ వసూలు చేస్తారు.