బిజినెస్

ఎట్టకేలకు లాభాల్లోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల క్రమంలో భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న వైరం కొంత ఉపశమించిన దాఖలాలు కనిపించడం మదుపర్ల సెంటిమెంటుపై సానుకూల ప్రభావం చూపింది. ఈక్రమంలో బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 192.84 పాయింట్లు (0.47 శాతం) లాభపడి 40,869.47 పాయింట్ల ఎగువన స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 59.90 పాయింట్లు (0.50 శాతం) లాభపడి 12,052.95 పాయింట్ల ఎగువన స్థిరపడింది. కాగా సెనె్సక్స్ ఇంట్రాడేలో ఏకంగా 553 పాయింట్లు ఎగబాకి 41,230.14 పాయింట్ల గరిష్టాన్ని తాకి వాణిజ్య వర్గాల్లో ఉత్సుకత రేపింది. అలాగే నిఫ్టీ సైతం ఓ దశలో 159 పాయింట్లు ర్యాలీ తీసి ఆసక్తిని రేపింది. దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఆరు నెలల కనిష్ట ఒక రోజు భారీ నష్టాలను చవిచూసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో మంగళవారం మధ్యప్రాచ్య రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో రూపాయి విలువ కొంత వరకు కోలుకుంది. దీంతో వాటాల కొనుగోళ్లు ఊపందుకోవడంతో సెనె్సక్స్ ప్యాక్‌లోని అల్ట్రా సిమెంట్ అత్యధికంగా 2.10 శాతం లాభపడింది. అదే బాటలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్‌పార్మా, ఎన్టీపీసీ, ఏసియన్ పెయింట్స్ సైతం లాభాలను సంతరించుకున్నాయి. మరోవైపు ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, నెస్టల్ ఇండియా, హీరో మోటోకార్ప్, పవర్‌గ్రిడ్ నష్టాల్లో ముగిశాయి. రం గాల వారీగా చూస్తే బీఎస్‌ఈలో స్థిరాస్తి, వౌలిక పరికరాలు, ఇందనం, ఫైనాన్స్, మెటల్ సూచీలు 1.83 శాతం లాభపడ్డాయి. టెలికాం, టెక్, ఐటీ, వినిమయ వస్తువుల సూచీలు 0.97 శాతం నష్టపోయాయి. ఇక బ్రాడర్ మార్కెట్‌లో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.99 శాతం లాభపడ్డాయి. ప్రధానంగా ఇరాన్‌కు చెందిన మేజర్ ముడిచమురు ఎగుమతిదారుగా ఉన్న కంపెనీ అమెరికాపై ప్రతీకారం తీర్చుకునే అంశంపై తటస్థంగా ఉండడం వల్ల ముడిచమురు ధరలు తగ్గేందుకు దోహదం చేసిందని విశే్లషకులు చెబుతున్నారు. అలాగే కేంద్ర గణాంకాల శాఖ 2020 ఆర్థిక సంవత్సర ముందస్తు బడ్జెట్ అంచనాల మేరకు జీడీపీ వృద్ధిరేటు 5 శాతానికి పరిమితమయ్యే అవకాశాలున్నాయి. మార్కెట్ వర్గాల్లో సైతం ఈ ముందస్తు అంచనాలున్నందువల్ల దీనిపై తదుపరి ఎలాంటి ప్రభావం ఉండబోదని ప్రముఖ విశే్లషకుడు వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు.
బలపడిన రూపాయి
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.26 తగ్గి బ్యారెల్ 68.73 డాలర్లు వంతున ట్రేడైంది. దీంతో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 11 పైసలు బలపడి ఇంట్రాడేలో 71.82గా ట్రేడైంది. ఈ క్రమంలో ఆసియా మార్కెట్లన్నీ కళకళలాడాయి. షాంఘై, హాంగ్‌కాంగ్, టో క్యో, సియోల్ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అలాగే ఐరోపా మార్కెట్లు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలనే నమోదు చేశాయి.