బిజినెస్

కావాల్సినంత ఉల్లి ఇస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఉల్లిపాయల విక్రయం చేపట్టారు. ఉల్లిపాయలు కావాలంటూ మొదట గగ్గోలు పెట్టిన రాష్ట్రాలు ప్రజల నుండి డిమాండ్ తగ్గడంతో కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీనితో ముంబయి ఓడరేవుకు వచ్చిన విదేశీ ఉల్లిపాయలు కుళ్లియే ప్రమాదం ఏర్పడింది. దేశంలో ఉల్లిపాయల కొరత ఏర్పడడంతో కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంది. ఇప్పుడు ఆ ఉల్లిపాయలను కొనేవారు కనిపించకపోవటంతో రాంవిలాస్ పాశ్వాన్ రంగప్రవేశం చేసి ముందు అడిగినట్లు ఉల్లిపాయలను కొనుగోలు చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. తక్కువ ధరకు విదేశీ ఉల్లిపాయలు అమ్ముతున్నాం.. కొనుక్కుని ప్రజలకు పంపిణీ చేయాలని ఆయన అన్ని ప్రభుత్వాలకు ఆహ్వానం పంపించారు. ఉల్లిపాయలను వాటి నాణ్యతను బట్టి కిలో 49 నుండి 58 రూపాయలకు విక్రయిస్తామని ఆయన తెలిపారు. రాంవిలాస్ పాశ్వాన్ మంగళవారం తమ కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి దేశంలో ఉల్లిపాయల డిమాండ్, లభ్యత, విదేశాల నుండి ఉల్లిపాయల దిగుమతి తదితర అంశాల గురించి వివరించారు. దేశంలో ఉల్లిపాయల కొరత ఏర్పడడం తెలిసిందే. ప్రజల ఉల్లిపాయల డిమాండ్‌ను తట్టుకొనేందుకు 33,139 టన్నుల ఉల్లిపాయలు కావాలని మొదట ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుండి డిమాండ్ తగ్గడంతో తమ అవసరాన్ని 14,309 టన్నులకు కుదించుకున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం అప్పటికే 40 వేల టన్నుల ఉల్లిపాయలను విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్‌లోకొనుగోలు చేసింది. కేంద్ర విదేశాల నుండి కొనుగోలు చేసిన ఉల్లిపాయాల దిగుమతి ఈ నెలాఖరుకు పూర్తవుతుంది. విదేశాల నుండి కొనుగోలు చేసిన మొత్తం ఉల్లిపాయల నుండి ఇప్పటికి 12వేల టన్నులు ముంబయి ఓడరేవుకు చేరుకున్నాయి. రాంవిలాస్ పాశ్వాన్ ఇప్పుడీ పనె్నండు వేల టన్నుల ఉల్లిపాయలను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించేందుకు కృషి చేస్తున్నారు. దేశంలో ఉల్లిపాయల ధరలు మరింత పెరగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ముంబయికి వచ్చిన ఉల్లిపాయలను కొనుగోలు చేయాలని ఆయన విజప్తి చేస్తున్నారు. మీరు ముందు ప్రతిపాదించినంత ఉల్లిపాయలను కొనుగోలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఉల్లిపాయలు కొనేందుకు ముందుకు రావడం లేదు. తమ తమ రాష్ట్రాల్లో ఉల్లిపాయల డిమాండ్ తగ్గిపోవడంతో కేంద్రం దిగుమతి చేసుకున్న ఉల్లిని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకాడుతున్నాయి. దీనితో విదేశాల నుండి ముంబయి వచ్చిన ఉల్లిపాయలను ఏంచేయాలనేది కేంద్ర ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు మొదట తమకు పెద్ద మొత్తంలో ఉల్లిపాయలు కావాలని డిమాండ్ చేసినా ఇప్పుడు తమ డిమాండ్ మేరకు ఉల్లిపాయలను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీనితో ముంబయి వచ్చిన ఉల్లి కుళ్లిపోయే ప్రమాదం నెలకొంది. ఉల్లిపాయలు కుళ్లిపోకుండా చూసేందుకు రాంవిలాస్ పాశ్వాన్ ఉల్లిపాయల దుకాణం తెరిచి కొనుగోలు చేసేందుకు ముందుకు రావాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలను బుజ్జగించడం ప్రారంభించారు.