బిజినెస్

కార్గో రవాణా నిర్వహణపై కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: ప్రజా రవాణాలో ప్రత్యేక గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూనే సంస్థ ఆర్థికంగా బలపడేందుకు పలు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది.
మంగళవారం బస్‌భవన్‌లో జరిగిన సమావేశంలో టీఎస్‌ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ ఆదాయ వనరులతో పాటు పార్శిల్స్ రవాణకు సంబంధించిన త్య్రేకంగా విధి విధానాలపై చర్చించారు. కార్గో సర్వీసు సేవల్ని అందుబాటులోకి తీసుకురావల్సిన విషయంపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. నష్టాల్లో ఉన్న సంస్థకు ఇదోక ఆదాయ మార్గంగా భావిస్తూ కార్గో సేవలు ఆశించినట్లుగా ఉండే దిశలో తక్షణమే ప్రణాళికను రూపొందించాలని సంబంధిత అధికారులను ఎండీ ఆదేశించారు. ఈ సమావేశంలో సంస్థకు సంబంధించిన ఈడీలు, కార్యదర్శి పురుషోత్తం కార్గో సర్వీసు సేవలపై రూపొందించిన కార్యాచరణను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
'చిత్రం...కార్గో రవాణా నిర్వహణపై ఆర్టీసీ భవన్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ