బిజినెస్

సరళతర వాణిజ్యంపై మార్చిలో తదుపరి ర్యాంకింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వచ్చే మార్చి నెలలో సరళతర వాణిజ్యంపై ప్రత్యేకంగా రెండో సూచీని ఏర్పాటు చేయనుంది. సరళతర వాణిజ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరును ఈ సూచీ అంచనా వేసి ర్యాంకింగ్ ఇస్తుందని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటికే ఎన్నికలు వంటి కారణాలతో ఈ సూచీ విడుదలలో జాప్యం జరిగిందని, బహుశా వచ్చే ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ సూచీ విడుదలవుతుందన్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సరళతర వాణిజ్యానికి సంబంధించిన అనుమతులకు ఏక గవాక్ష (సింగిల్ విండో) విధానం వంటి అనేక చర్యలు చేపడుతున్నాయి. నిర్మాణ అనుమతులు, కార్మిక నియంత్రణ, పర్యావరణ రిజిస్ట్రేషన్లు, సమాచార సౌలభ్యత, స్థల లభ్యత, సింగిల్ విండో విధానం వంటి అంశాలను మరింత పటిష్టవంతం చేసేందుకు చర్యలు మొదలైనట్టు ఆ అధికారి తెలిపారు. ఇందులో భాగంగా కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యాభివృద్ధి శాఖ (డీపీఐఐటీ), ప్రపంచ బ్యాంకు సౌజన్యంతో వార్షిక సంస్కరణలను ‘బిజినెస్ రీఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ (బీఆర్‌ఏపీ) కింద చేపట్టింది.
ఇందుకు సంబంధించిన చివరి ర్యాంకింగ్‌ను గతంలో 2018 జూలైలో ప్రభుత్వం విడుదల చేయగా అప్పట్లో ఆంధ్రప్రదేశ్ అగ్ర భాగాన నిలిచింది. తెలంగాణ, హర్యానా తదుపరి స్థానాలను ఆక్రమించాయి. ఝార్కండ్, గుజరాత్, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ తదుపరి వరుస టాప్‌టెన్ స్థానాల్లో నిలిచాయి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు సరళతర వాణిజ్యాభివృద్ధికి చేపట్టిన సంస్కరణకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన ఫీడ్‌బ్యాక్ స్కోరు ఆధారంగా ఈ ర్యాంకింగ్‌లు కల్పిస్తున్నట్టు ఆ అధికారి స్పష్టం చేశారు. 2018లోప్రభుత్వాల పనితీరుపై ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక మేరకు మొత్తం 190 ఆర్థిక శక్తుల్లో (దేశాల్లో) భారత్ తన స్థానాన్ని మెరుగుపరుకుని 77 నుంచి 63వ స్థానానికి చేరింది.