బిజినెస్

షాకిచ్చిన స్టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. బీఎస్‌ఈ సెనె్సక్స్ ఏకంగా 788 పాయింట్లు పడిపోవడంతో ఇనె్వస్టర్లు కకావికలయ్యారు. లావాదేవీలు ముగిసేనాటికి గత ఆరు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా 787.98 పాయింట్లు కోల్పోయిన సెనె్సక్స్ 40,676.63 వద్ద ముగిసింది. ఒకేరోజు ఇన్ని వందల పాయింట్ల మేర సెనె్సక్స్ పడిపోవడం గత ఏడాది జూలై 8 నుంచి ఇదే మొదటిసారి. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 233.60 పాయింట్లు కోల్పోయి 11,993.5 వద్ద ముగిసింది. నేటి లావాదేవీల్లో బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా నష్టపోయింది. దీని షేర్ల విలువ ఏకంగా 4.63 శాతం మేర పడిపోయింది. ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, హీరో మోటోకార్ప్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు కూడా గణనీయంగా నష్టం వాటిల్లింది. ఇంత భారీగా మార్కెట్ పతనమైనా టైటాన్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు మాత్రం లాభాలతో ముగిశాయి. మెటల్ ఫైనాన్స్, రియల్టీ, బ్యాంకెక్స్, ఎనర్జీ, ఆటో, చమురు సహజవాయువు, మూలధన వస్తువులు, హెల్త్‌కేర్ కంపెనీల షేర్లు కూడా 2.96 శాతం మేర నష్టపోయాయి. ఓ పక్క ముడిచమురు ధరలు పెరగడంతోపాటు భారతీయ కరెన్సీ బలహీనపడుతున్న ప్రభావం లావాదేవీలపై కనిపించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి సోమవారం ఏకంగా 13 పైసలు నష్టపోయి 71.93కు చేరుకుంది. వాస్తవ పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నాయని, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో తొలగిపోయే ఆలోచన లేదన్న బలంగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడితే అత్యంత భయానక రీతిలో స్పందిస్తామనే ట్రంప్ చేసిన హెచ్చరిక ఇనె్వస్టర్లలో భయాన్ని పుట్టిస్తోంది. ఒక్క భారతీయ మార్కెట్లే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లపై కూడా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం తీవ్రంగా ఉంది. షాంఘై, హాంకాంగ్, టోకియో, సియోల్ మార్కెట్లు కూడా నష్టంతోనే ముగిశాయి. అయితే, మిగతా అంతర్జాతీయ మార్కెట్లపై కంటే కూడా పెరిగిన చమురు ధరల ప్రభావం భారతీయ మార్కెట్లపైనే ఎక్కువగా ఉందని, అందుకే సెనె్సక్స్ ఇంత భారీగా పతనమైందని నిపుణులు విశే్లషిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ముడిచమురు దిగుమతులపైనే భారతీయ వినియోగం ఆధారపడి ఉండడమేనని విశే్లషిస్తున్నారు.