బిజినెస్

బంగారం 10 గ్రాములు రూ.41,730

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: మార్కెట్ల ప్రతికూల వాతావరణం నెలకొనడంతో సురక్షిత పెట్టుబడులపైనే మదుపుదారులు దృష్టి పెట్టడంతో బంగారం పంట పండింది. దేశ రాజధానిలో సోమవారం 10 గ్రాములకు ఏకంగా 720 రూపాయల మేర బంగారం రేటు పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర 41,730 రూపాయలకు చేరుకుంది. వెండి కొనుగోళ్లపై కూడా మదుపుదారులు దృష్టి పెట్టడంతో దీనిపై రేటు కూడా కిలోకు 1,100 రూపాయల చొప్పున పెరిగింది. భారతీయ రూపాయి మారకం బలహీనపడడం, అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో దేశీయ మార్కెట్‌లో కూడా వీటి కొనుగోళ్లకు డిమాండ్ పెరిగిందని, అందుకే ఆల్‌టైమ్ హై స్థాయిలో పసిడి ప్రకాశించిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ అధినేత దేవాస్ వకీల్ విశే్లషించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారానికి డిమాండ్ పెరిగింది.