బిజినెస్

ఏడాదికి రూ. లక్ష విద్యుత్ బిల్లు కడితే ఐటీఆర్-1కు అనర్హులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఏడాదికి లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువు విద్యుత్ బిల్లు చెల్లించేవారు, ఇళ్లకు యజమానులు ఆదాయ పన్ను శాఖ ఇటీవల ప్రవేశపెట్టిన సంస్కరణల్లో భాగమైన ఐటీఆర్-1 రిటర్న్‌ను దాఖలు చేయడానికి అనర్హులు. విదేశీ పర్యటనల కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసిన వారిని కూడా ఆదాయ పన్ను శాఖ ఐటీఆర్-1కు అనర్హులుగా స్పష్టం చేసింది. ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో వ్యక్తులు తమతమ ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేయడానికి నిబంధనలను జనవరిలోనే ప్రకటిస్తుంది. అందులో భాగంగానే, 2019 ఏప్రిల్ ఒకటి నుంచి 2020 మార్చి 31 వరకు ఉండే 2020-21 అసెస్మెంట్ ఇయర్‌కు ఐటీఆర్-1, ఐటీఆర్-4 వివరాలను వెల్లడించింది. దేశంలో నివాసం ఉంటూ, సంవత్సరానికి 50 లక్షల రూపాయల కంటే తక్కువ ఆదాయాన్ని పొందుతున్న వారు ఐటీఆర్-1 సహజ్ రిటర్న్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా, తమతమ వ్యాపారాలు, వృత్తుల ద్వారా ఇదే మొత్తం కంటే ఎక్కువ ఆదాయం లేని వారు ఐటీఆర్-4 సుగమ్ రిటర్న్స్‌ను దాఖలు చేయాలి. ఈ జాబితాలోనే 50 లక్షల రూపాయలకు మించి ఆదాయం లేని సంస్థలు, కంపెనీలు, అవిభాజ్య హిందూ ఉమ్మడి కుటుంబాలు కూడా చేరతాయి. అయితే, ఐటీ శాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ బిల్లులు చెల్లించిన వారు లేదా ఇళ్లకు ఉమ్మడి యజమానులు ఐటీఆర్-1ను దాఖలు చేయడానికి అనర్హులు. వారు చెల్లించాల్సిన పన్ను రేటు విడిగా ఉంటుంది. కోటి రూపాయల వరకూ బ్యాంకు ఖాతాల్లో ఉన్న వారు కూడా ఐటీఆర్-1ను దాఖలు చేయడానికి అనర్హులే. టాక్స్ రిటర్న్స్ సమర్పించే సమయంలో ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆదాయ పన్ను శాఖ తన ప్రకటనలో స్పష్టం చేసింది.