బిజినెస్

తగ్గుతున్న ఉల్లి ఘాటు.. పెరుగుతున్న ఎండుమిర్చి రేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, జనవరి 5: బహిరంగ మార్కెట్‌లో ఉల్లిపాయల ధరల ఘాటు రానురానూ తగ్గుతోంది. గత నెలారంభంలో కిలో రూ.180 దాకా అమ్మిన ఉల్లిపాయలు క్రమేణా ధర తగ్గుతూ నేటికి కిలో రూ.60కి చేరింది. ఉల్లిపాయల ధరలను నియంత్రించలేని ప్రభుత్వం వినియోగదారులకు సబ్సిడీ ధరకు రైతుబజారుల ద్వారా కిలో రూ.25లకు అందించడంతో పేద, బడుగు వర్గాల ప్రజలే కాదు ధనికులు సైతం రైతుబజార్ల వద్ద క్యూలైన్‌లో బారులుతీరిన విషయం విదితమే. అలాగే ఎండుమిర్చి గత నెలలో కిలో రూ.150, 180 అమ్మి, నేడు బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.220కి ఎగబాకింది. బీరకాయలు, వంకాయలు, చిక్కుడుకాయలు ఇలా అన్ని రకాల కూరగాయలు కిలో రూ.35నుండి 60 వరకు పెరిగాయి. క్రమేణా వాటి ధరలు తగ్గుముఖం పడుతుండగా ఉల్లిధరల బాంబు వినియోగదారులను భయకంపితులను చేసింది. మహారాష్ట్ర, సోలాపూర్ నుండి తెప్పించిన మార్కెటింగ్‌శాఖ అధికారులు అరకొరగా మధ్యలో ఆపేసినాగానీ ఉల్లిపాయల సరఫరా విషయంలో రాజీపడలేదనే చెప్పవచ్చు. ప్రభుత్వం ఉల్లిపాయల సమస్యను ఛాలెంజ్‌గానే తీసుకుంది. పొరుగు రాష్ట్రాల్లో కిలో ఉల్లిపాయలు రూ.40 చొప్పున రైతుబజార్ల ద్వారా ప్రజలకు సరఫరా చేయగా మన రాష్ట్రంలో మాత్రం కిలో కేవలం రూ.25లకే అందుబాటులోకి తెచ్చారు. వినియోగదారుల ఇబ్బందులు తొలగించాలని టర్కీ, ఈజిప్టు దేశాల నుండి సముద్రయానం ద్వారా తెప్పించారు. రాష్ట్ర ప్రజలు అంత పెద్ద ఉల్లిపాయలు ఇంతకు ముందెన్నడూ చూడలేదు. అలాంటి ఉల్లిపాయలు తీసుకున్న వినియోగదారులు హర్షం ప్రకటించారు. అయితే మధ్యలో కేపీ ఉల్లిపాయలు అంటూ అతి చిన్న ఉల్లిపాయలు అమ్మిన మార్కెటింగ్‌శాఖ అధికారుల తీరుపై ‘్భమి’లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు కిలో రూ.50 నుండి 25కి తగ్గించిన విషయం విదితమే. కాగా నేడు అదే కేపీ ఉల్లిపాయలు రైతుబజారుల్లో కిలో రూ.15లకే అమ్మడం ముదావహం. వారం తరువాత ఉల్లిపాయలు వచ్చాయి, మళ్లీ మూడు రోజులు విరామం వచ్చింది. ఆదివారం నగరంలో ఏ రైతుబజారులోనూ ఉల్లిపాయలు అమ్మకాలు జరగలేదు. ఉల్లి కష్టాలు తీరనున్నాయి. స్థానిక ఉల్లి పంట అందుబాటులోకి రావడంతో అది నేడు కిలో రూ. 60లకే లభిస్తున్నాయి. వారం రోజుల్లో వాటి ధర రూ.30కి చేరుతుందని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఎండుమిర్చి ధర మాత్రం కిలో రూ.220కి చేరుకుని మండుతోంది.